రెండు వందల తిరస్కరణలు!

‘కుక్క కోసం ప్రత్యేక యాక్సెసరీలు, దుస్తులు, గిన్నెలా..’ ఇదేం పిచ్చి ఆలోచన! నా వ్యాపారం గురించి చెప్పినప్పుడు చాలామంది అన్నమాట ఇది. ఒకప్పుడు ఎంత ప్రేమున్నా పెంపుడు జంతువులను ఇళ్లలోకి తీసుకునే వాళ్లు కాదు.

Updated : 03 Dec 2022 04:55 IST

అనుభవపాఠం

‘కుక్క కోసం ప్రత్యేక యాక్సెసరీలు, దుస్తులు, గిన్నెలా..’ ఇదేం పిచ్చి ఆలోచన! నా వ్యాపారం గురించి చెప్పినప్పుడు చాలామంది అన్నమాట ఇది. ఒకప్పుడు ఎంత ప్రేమున్నా పెంపుడు జంతువులను ఇళ్లలోకి తీసుకునే వాళ్లు కాదు. ఇప్పుడలా కాదు. వాటినీ కుటుంబ సభ్యుల్లా, ఇంకా చెప్పాలంటే సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు వాటి పోషణలో రాజీ ఎందుకు పడతారు? అదే ఆలోచనతో పెంపుడు జంతువుల వస్తువుల కోసం ప్రత్యేకంగా సంస్థను ప్రారంభించా. మా ఉత్పత్తులను ఉంచమని ఎన్ని స్టోర్‌లకు వెళ్లినా తిరస్కరణలే! 200 మంది వెనక్కి పంపించేశారు. ఇలా కాదని.. స్టాల్స్‌, ఆపై ఆన్‌లైన్‌ అమ్మకాలు మొదలుపెట్టా. తమ పెంపుడు జంతువులకు అన్నీ ప్రత్యేకంగా ఉండాలనుకునే వారంతా సంప్రదించడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దాదాపు 50 సొంత స్టోర్లు ప్రారంభించా. తిరస్కరణ బాధిస్తుంది.. నిజమే! అంతమాత్రాన నమ్మకం కోల్పోవద్దు. వేగం తగ్గించుకొని నెమ్మదిగా ప్రయత్నించండి. ఆరంభంలో ఇవన్నీ సహజమే అనుకుంటూ.. ఓటమిని పాఠాలుగా చేసుకుంటూ సాగండి. అంతేకానీ ప్రయత్నం మాత్రం ఆపొద్దు.

- రాశి నారంగ్‌, వ్యవస్థాపకురాలు, హెడ్స్‌ అప్‌ ఫర్‌ టెయిల్స్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్