చిత్రాతి చిత్రంగా...!

అమ్మ చెప్పిన కథలు, చిన్ననాటి జ్ఞాపకాలు... అందరి మనసుల్లోనూ అందంగా బంధీయై ఉన్నట్టుగానే మధురై అమ్మాయి వర్షిణి కృష్ణ మనసులోనూ ఉన్నాయి. వాటిని ఇతరులకు అందంగా చూపించాలనుకున్న క్రమంలోనే ఆమె చిత్రకారిణిగా మారింది.

Updated : 08 Dec 2022 13:01 IST

అమ్మ చెప్పిన కథలు, చిన్ననాటి జ్ఞాపకాలు... అందరి మనసుల్లోనూ అందంగా బందీయై ఉన్నట్టుగానే మధురై అమ్మాయి వర్షిణి కృష్ణ మనసులోనూ ఉన్నాయి. వాటిని ఇతరులకు అందంగా చూపించాలనుకున్న క్రమంలోనే ఆమె చిత్రకారిణిగా మారింది. బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తయ్యాక.. తన మనసులోని ఆలోచనలని చిత్రాల రూపంలో వేస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. అప్పుడే ఆయిల్‌ పెయింటింగ్‌, తంజావూరు చిత్రకళ, డూడ్లింగ్, గ్రాఫిక్స్‌, డిజిటల్‌ పెయింటింగ్‌ వంటి కళల్లో శిక్షణ తీసుకుని, ఆరితేరింది. మనం అభిమానించే తారలని ఇంకాస్త అందంగా చూడాలని తాపత్రయపడుతుంటాం కదా.. అలా అభిమాన తారలని అందంగా మార్చే మూవీ సీన్‌ రిక్రియేషన్‌ విద్యనీ నేర్చుకుంది. వీటిని తన ఇన్‌స్టా పేజీ హ్యాపీసేపియన్‌ డూడుల్స్‌లో ఉంచేది. ఈ మధ్య విడుదలైన.. పీఎస్‌1, సీతారామం, విక్రమ్‌ వంటి సినిమాల్లోని అభిమాన తారల్ని అందమైన బొమ్మలుగా తీర్చిదిద్ది ఇన్‌స్టాలో లక్షమంది అభిమానులని సంపాదించుకుంది. బొమ్మలు వేయడం తన అభిరుచి మాత్రమే కాదు.. సంపాదన మార్గం కూడా. తను వేసిన బొమ్మలతో స్టిక్కర్లు, ఇలస్ట్రేటెడ్‌ నోట్‌బుక్కులు, కలరింగ్‌ పుస్తకాలు, చిత్రలేఖనం నేర్పే పుస్తకాలు, కొత్తసంవత్సరానికి కావాల్సిన క్యాలెండర్లని తయారుచేస్తూ సంపాదిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్