నో ఎదురైతేనేం?

అనుభవం లేదు.. మంచి ఉద్యోగమూ లేదు. పాకెట్‌ మనీతో కంపెనీ ప్రారంభిద్దామని వచ్చేశారా? ‘జోష్‌ టాక్స్‌’ ఆలోచన చెప్పినప్పుడు మాకెదురైన ప్రశ్నలివీ! మాది సంప్రదాయ కుటుంబం. పెద్ద చదువులు చదవాలి. మంచి ఉద్యోగంతో ‘సెటిల్‌’ అవ్వాలన్నది చిన్నప్పటి నుంచీ అమ్మానాన్నల సలహా.

Updated : 10 Dec 2022 04:19 IST

అనుభవ పాఠం

నుభవం లేదు.. మంచి ఉద్యోగమూ లేదు. పాకెట్‌ మనీతో కంపెనీ ప్రారంభిద్దామని వచ్చేశారా? ‘జోష్‌ టాక్స్‌’ ఆలోచన చెప్పినప్పుడు మాకెదురైన ప్రశ్నలివీ! మాది సంప్రదాయ కుటుంబం. పెద్ద చదువులు చదవాలి. మంచి ఉద్యోగంతో ‘సెటిల్‌’ అవ్వాలన్నది చిన్నప్పటి నుంచీ అమ్మానాన్నల సలహా. అలాంటిది 20 ఏళ్ల వయసులో ఆంత్ర ప్రెన్యూర్‌ అవుతానన్నా. నా ఆలోచనను వాళ్లు సీరియస్‌గా తీసుకోకపోగా.. ‘నీకేం అనుభవముంది? దీనిలో డబ్బులెలా సంపాదిస్తావ్‌? మంచి ఉద్యోగం వెతుక్కోక’ అని నిరుత్సాహపరిచారు. ఇన్వెస్టర్లూ నాతో మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. దీంతో నా మీద నాకే అనుమానం. నా పరిజ్ఞానం సరిపోదా? అసలు నేనే పనికి రానా? అని. వ్యాపారం అంటేనే జాగ్రత్త పేరుతో వెనక్కిలాగుతారు. అలాంటిది అమ్మాయిని ప్రయత్నిస్తోంటే ఇవన్నీ మామూలే అనుకున్నాక ఆత్మవిశ్వాసం పెరిగింది. ముందు ఇంట్లో ఒప్పించా. తర్వాత బయటి వారిపై దృష్టిపెట్టా. ‘ఇంట గెలిచి..’ సామెతను పాటించానన్నమాట. ప్రతి ఒక్కరూ మనకు దిశానిర్దేశం చేసేవాళ్లు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. నగరాల్లో ఉండేవారికి కళాశాలల తరఫున ఆ అవకాశం ఉంటుంది. చిన్న పట్టణాలు, పల్లెలవారికీ అవకాశమివ్వాలన్నది ‘జోష్‌ టాక్స్‌’ ఉద్దేశం. వివిధ రంగాల వారి అనుభవాల్ని అందరికీ వీడియోల రూపంలో చేరువ చేస్తాం. వెబ్‌సైట్‌, యూట్యూబ్‌, యాప్‌లను రూపొందించాం. 10 స్థానిక భాషల్లో కంటెంట్‌ అందుబాటులో ఉంది. నైపుణ్యాలను నేర్చుకునేలా యాప్‌లూ తీసుకొచ్చాం. ఎన్నో సంస్థలు మమ్మల్ని నమ్మి పెట్టుబడి పెడుతున్నాయి. ‘నో’ ఎదురైనంత మాత్రాన వెనకడుగు వేయొద్దు. ముందు మీపై మీరు విశ్వాసం ఉంచండి, ఆపై కుటుంబ ప్రోత్సాహం పొందండి. సగం విజయం సాధించినట్టే!

-సుప్రియా పాల్‌, సీఈఓ, జోష్‌ టాక్స్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్