ఆ మూడూ.. నా శక్తులు!

చదువుకుంటున్నప్పుడే తెలుసు.. తర్వాత కుటుంబ వ్యాపారంలోకి చేరతానని. అందుకే నా స్నేహితులంతా మంచి ఉద్యోగం కోసం సిద్ధమవుతోంటే నేను వ్యాపారాంశాలపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించా.

Published : 12 Dec 2022 00:01 IST

అనుభవ పాఠం

దువుకుంటున్నప్పుడే తెలుసు.. తర్వాత కుటుంబ వ్యాపారంలోకి చేరతానని. అందుకే నా స్నేహితులంతా మంచి ఉద్యోగం కోసం సిద్ధమవుతోంటే నేను వ్యాపారాంశాలపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించా. మనవారితోపాటు విదేశీయుల పనితీరునీ పరిశీలించా. నేర్చుకోవడం, అనుభవం సంపాదించడం అయ్యాక మూడు అంశాలను మాత్రం పాటిస్తూవచ్చా.


1 పని పట్ల నీతి, నిజాయతీలతో వ్యవహరించడం. మన స్థాయిని ప్రదర్శిస్తూ వెళితే అక్కడే ఆగిపోతాం. నలుగురినీ కలుపుకొంటూ వెళ్లాలి, కలసి పనిచేయాలి, ఒకరికొకరు సాయం అందించాలి. అప్పుడే పనీ సజావుగా సాగుతుంది. అందరిలో మనది అన్న భావన ఏర్పడుతుంది. చిన్న, పెద్ద స్థాయితో సంబంధం లేకుండా ఎవరితోనైనా కలిసి పని చేస్తా.


2 నిన్ను నువ్వు తెలుసుకుంటే ప్రపంచమూ తెలుస్తుందన్న సూత్రాన్ని నమ్ముతా. నాకేం కావాలి, ఏది ముఖ్యం, వేటికి ప్రాధాన్యమివ్వాలన్నది తెలుసు. వాటికి సమయం కేటాయిస్తుంటే అనవసర విషయాలపైకి ఆలోచనలు సాగవు.
ఇక నెగెటివిటీకి ఆస్కారమేది?


3 ఓటమి బాధిస్తుంది. అలాగని ఆగిపోతే ఎలా? ‘ఓడిపోయా.. అయితే ఏంటి? మళ్లీ ప్రయత్నిస్తా’ అని ముందుకు సాగుతా. అప్పుడు ప్రతి ఓటమీ పాఠంలా తోస్తుంది. దీంతో మరింత ఉత్సాహంగా ప్రయత్నిస్తాం. తిరిగి అదే పొరబాటు చేయం కాబట్టి.. విజయమే! ఇవే నన్ను నడిపే శక్తులు.

- లావణ్య నల్లి, వైస్‌ ఛైర్మన్‌,నల్లి సిల్క్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్