ఆర్థిక పాఠాలు నేర్వండి!

మహిళా సాధికారత అన్న పదానికి ఆస్కారం లేని రోజుల్లో పుట్టాన్నేను. స్థోమత ఉంటే చదువు, అత్తారింట్లో ఒప్పుకొంటే ఉద్యోగం.. అదైనా పిల్లలు పుట్టాక మానేయాల్సిందే! ‘మరీ ఎక్కువ చదువు  అమ్మాయిలకు అంత మంచిది కాదు’ అన్న సలహాలొచ్చేవి. కానీ మా నాన్న వీటికి వ్యతిరేకం.

Updated : 13 Dec 2022 04:24 IST

అనుభవ పాఠం

హిళా సాధికారత అన్న పదానికి ఆస్కారం లేని రోజుల్లో పుట్టాన్నేను. స్థోమత ఉంటే చదువు, అత్తారింట్లో ఒప్పుకొంటే ఉద్యోగం.. అదైనా పిల్లలు పుట్టాక మానేయాల్సిందే! ‘మరీ ఎక్కువ చదువు  అమ్మాయిలకు అంత మంచిది కాదు’ అన్న సలహాలొచ్చేవి. కానీ మా నాన్న వీటికి వ్యతిరేకం. అమ్మాయిలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలనేవారు. ఏం చదువుకుంటానన్నా, ఉద్యోగం చేస్తానన్నా ప్రోత్సహించేవారు. ఒక రకంగా ఫైనాన్స్‌ రంగంపై నా ఆసక్తికీ ఆయనే కారణం. అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలన్న ఆయన మాటలే నన్ను ఇటువైపు నడిపాయి. అమ్మాయి ఆర్థిక రంగమా అన్న స్థాయి నుంచి దేశంలోనే ఈ రంగంలో అత్యంత ప్రభావశీల మహిళగా ఎదగగలిగా. ఆయన స్ఫూర్తితోనే మా సేవా సంస్థ ద్వారా ఎందరో మహిళల్ని వ్యాపార రంగంలోకి నడిచేలా ప్రోత్సహిస్తున్నా. ఆర్థిక భరోసా ఏదైనా చేయగల ధైర్యాన్నిస్తుంది. కాబట్టి, పెద్ద చదువులు చదవ లేదు.. ఆర్థిక వ్యవహారాలు తెలియవు, అవి మగవాళ్లు చూసుకుంటారులే అంటూ కూర్చోక.. నేర్చుకోవడం మొదలుపెట్టండి. మీకోసమంటూ కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించండి. పొరపాటు జరుగుతుందన్న భయమొద్దు. వైఫల్యం ఎదురైతేనేం.. ఓ పాఠం నేర్చుకుంటారు! తర్వాత మీకే తెలియని ధైర్యం మీలో చేరుతుంది.

- విద్యా షా, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్