పెళ్లికి ఒక్కరోజు సెలవు!

ఇంజినీరింగయ్యాక ఎంబీఏ చేశా. ఓ ప్రముఖ రిటైల్‌ సంస్థలో ఉద్యోగం. బాగా సెటిల్‌ అయ్యా అనుకున్నారు అమ్మావాళ్లు. కానీ వ్యాపారంలోకి వెళతానన్నా. మొదట సందేహించినా తర్వాత సరేనన్నారు.

Updated : 14 Dec 2022 04:45 IST

అనుభవపాఠం

ఇంజినీరింగయ్యాక ఎంబీఏ చేశా. ఓ ప్రముఖ రిటైల్‌ సంస్థలో ఉద్యోగం. బాగా సెటిల్‌ అయ్యా అనుకున్నారు అమ్మావాళ్లు. కానీ వ్యాపారంలోకి వెళతానన్నా. మొదట సందేహించినా తర్వాత సరేనన్నారు. అయితే నా వ్యాపారం లోదుస్తుల గురించి అన్నప్పుడు అమ్మ ‘ఇంత చదువు చదివి లోదుస్తులు అమ్ముతావా?’ అంది. తర్వాత పెట్టుబడి కోసం ఎక్కడికి వెళ్లినా.. అదో మాట్లాడకూడని విషయంలా ప్రవర్తించే వారు. అమ్మాయిల ఆరోగ్యంలో వీటి పాత్రా ప్రధానమే! ఆ విషయాన్నే వివరించాక నెమ్మదిగా మార్పు మొదలైంది. ఈ క్రమంలో వ్యతిరేకతలెన్నో! కానీ నేను చేసేదానిపై నాకు స్పష్టత ఉంది. అందుకే ఎవరేమన్నా వెనక్కి తగ్గలేదు. ప్రారంభంలో పెట్టుబడి, సంస్థ నిర్వహణతో తీరికే ఉండేది కాదు. నా పెళ్లికీ ఒక్కరోజే సెలవు తీసుకున్నా. శనివారం పెళ్లైతే.. సోమవారం నుంచి తిరిగి పనిలో పడ్డా. నేను ఉద్యోగం మానేయడానికి ముందే మావారు కేదార్‌ నాకు  పరిచయం. నా లక్ష్యం అర్థమైంది కాబట్టి, ప్రోత్సహించారు. ఇప్పుడు పరిస్థితి వేరు. సంస్థకి గుర్తింపొచ్చింది. లాభాల బాటా పట్టింది. పని, ఇల్లు రెంటిని సమన్వయం చేస్తున్నా. కచ్చితమైన పని వేళలు పాటిస్తున్నా. కుటుంబానికీ సమయం కేటాయిస్తున్నా. ఏమాత్రం వీలు దొరికినా విహారయాత్రలకీ వెళుతుంటాం. కెరియర్‌లో ముందుకు సాగాలంటే మొదట్లో కష్టపడక తప్పదు. అయితే అదే లోకంలా ఉండకూడదు. వ్యక్తిగత జీవితానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇంటా, బయటా గెలవగలం.

- రిచా కర్‌, సహ వ్యవస్థాపకురాలు, జివామె

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్