వాళ్ల మాట వినలేదు.. కాబట్టే!

‘అవర్‌ వాయిక్స్‌’ మొదలుపెడతా అన్నప్పుడు.. ‘మంచి కార్పొరేట్‌ ఉద్యోగం సంపాదించి కొన్నేళ్లు బాగా కూడబెట్టు, 24 ఏళ్లకే సమాజ సేవా? అందుకు ఎంత అనుభవం కావాలో తెలుసా?’ అంటూ ఎన్నో సలహాలు.

Updated : 16 Dec 2022 01:12 IST

అనుభవ పాఠం

‘అవర్‌ వాయిక్స్‌’ మొదలుపెడతా అన్నప్పుడు.. ‘మంచి కార్పొరేట్‌ ఉద్యోగం సంపాదించి కొన్నేళ్లు బాగా కూడబెట్టు, 24 ఏళ్లకే సమాజ సేవా? అందుకు ఎంత అనుభవం కావాలో తెలుసా?’ అంటూ ఎన్నో సలహాలు. లా చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు ‘పిల్లలపై లైంగిక వేధింపుల’ గురించి పరిశోధన చేశా. ఒక్కో ఘటననీ తెలుసుకున్నప్పుడు వెన్నులోంచి వణుకొచ్చింది. గుండెను ఎవరో పిండేసినంత బాధ. అప్పుడే మానవ హక్కుల గురించి అధ్యయనం చేయాలనుకున్నా. లండన్‌లో కోర్సు చేసి, తిరిగొచ్చాక నేను చేసిన మొదటి పని.. సంస్థను స్థాపించడమే. నాకు అనుభవం లేదు నిజమే... కానీ ఆ పసి ప్రాణాలను కాపాడాలి, సాంత్వన కలిగించాలన్న దృఢ సంకల్పం ఉంది. అందుకే లాయర్లు, సైకాలజిస్టులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో బృందాన్ని ఏర్పాటు చేశా. దేశ వ్యాప్తంగా పాఠశాలలకు వెళ్లి మంచి, చెడు స్పర్శ గురించి బోధించేవాళ్లం. లైంగిక వేధింపుల బాధితులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం, నలుగురిలో కలిసేలా చేయడం, వాళ్ల తరఫున న్యాయపోరాటం వంటివి చేస్తున్నాం. ముఖ్యంగా వాళ్లలో అభద్రతా భావాన్ని పోగొడుతున్నాం. ప్రారంభంలో ఉపాధ్యాయులు పిల్లలతో మాట్లాడటానికీ అవకాశమిచ్చేవారు కాదు. తల్లిదండ్రులూ ‘మా ఇళ్లలో అలా జరగవు’ అనేవారు. ఓపిగ్గా వాళ్లకి అవగాహన కలిగించాం. ఎంతో మందిని వీటి నుంచి రక్షించ గలుగుతున్నాం. ఆ సంక్షోభం నుంచి బయటపడేయగలుగుతున్నాం. ఇవి చూసినప్పుడే.. మొదట్లో అందరి సలహాలూ పట్టించుకోకపోవడం మంచిదైంది అనిపిస్తుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్