Updated : 17/12/2022 01:19 IST

తోడుగా ఉండే బొమ్మలు!

ఒంటరితనంలో ఓ తోడు కావాలని ఉంటుంది. కానీ నేనున్నానని ఆ ఊరట ఇచ్చేదెవరు? ఏ సమయంలో అయినా సరే ఆ ఆత్మీయ స్పర్శని అందిస్తాయి హగిమల్స్‌ బొమ్మలు. వీటిని ఒళ్లో పెట్టుకుంటే... అవి మనల్ని హత్తుకున్న భావన కలిగించి, ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. దాంతో ఒత్తిడి, ఆందోళన వంటి భావనలు తొలగి సంతోషంగా ఉంటామట. సుదీర్ఘకాలంపాటు హెల్త్‌ జర్నలిస్ట్‌గా పనిచేసిన మెరినాకిడెకెల్‌ ఈ బొమ్మల రూపకర్త. కొన్నాళ్లపాటు నిద్రలేమి సమస్యలతో బాధపడిన మెరినాకి వెయిటెడ్‌ బ్లాంకెట్లు ఆ సమస్య నుంచి ఊరటనిచ్చాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గించాయి. ‘కానీ బరువైన ఆ దుప్పట్లని అన్ని చోట్లకూ తీసుకెళ్లలేం కదా! అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. దుప్పట్లలో వాడిన మెటీరియల్‌తో బొమ్మల్ని తయారుచేస్తే ఎలా ఉంటుందని? వాటినైతే ఎక్కడికైనా సౌకర్యవంతంగా తీసుకెళ్లొచ్చు. ముందుగా వీటిని పిల్లల కోసం తయారుచేశాం. ఇందుకోసం మానసిక నిపుణులు, పిల్లల వైద్యులు, థెరపిస్టులు, బొమ్మల తయారీలో నిపుణులని కలిసి ఈ హగిమల్స్‌ని రూపొందించా. వీటిలో నింపిన ప్రత్యేకమైన గ్లాస్‌బీడ్స్‌వల్లనే అవి మామూలు బొమ్మలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. వాటితోపాటు నిద్రపోతే.. ఆత్మీయులు తోడుగా పడుకున్న భావన కలుగుతుంది’ అంటుంది మరినా. పిల్లల్లో పెరుగుతున్న ఒంటరితనం, ఆటిజం వంటి సమస్యలని అదుపు చేయడానికి పిల్లల ఆసుపత్రులు ఈ బొమ్మలని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఈ ఏడాది ఉత్తమ ఆవిష్కరణల్లో ఒకటిగా టైమ్‌ పత్రిక ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి