Reena Raju: నా గుండెను మారుస్తూనే ఉంటారు..

నా గుండె ఆగిపోతుందని అనుకున్నప్పుడల్లా గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంటుంది. మీరు చదివింది నిజమే.

Updated : 20 Dec 2022 10:56 IST

అనుభవపాఠం

నా గుండె ఆగిపోతుందని అనుకున్నప్పుడల్లా గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంటుంది. మీరు చదివింది నిజమే.  ఇప్పటికి రెండు సార్లు అలా మార్చారు. డైలేటెడ్‌ కార్డియోమయోపతీ అనే వ్యాధితో పుట్టిన నన్ను అమ్మానాన్న చాలా గారంగా పెంచారు. కండరాల్లో రక్తసరఫరాకు ఆటంకం కలిగి, గుండె పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు ఎవరైనా అవయవ దానం చేస్తే బతుకుతుంటా. ఈ రోజు నేనిలా మీ ముందుండటానికి కారణమైన అవయవ దానంపై అందరికీ అవగాహన కలిగించాలన్నదే నా లక్ష్యం. అలాగే దీనికయ్యే ఖర్చునూ పేదలు తట్టుకోలేరు. అటువంటివారికి తిరిగి జీవితాన్ని అందించడం కోసం 2011లో ‘లైట్‌ ఏ లైఫ్‌’ ఛారిటబుల్‌ ట్రస్టును స్థాపించా. దీని ద్వారా పేద రోగులకు అవయవ దానంతో పాటు ఆర్థికసాయమూ అందేలా కృషి చేస్తున్నా. చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. దీంతో గుండెమార్పిడి జరిగిన కొన్ని నెలల్లోనే వైద్య నిపుణుల సలహాతో బ్యాడ్మింటన్‌, సైక్లింగ్‌ వంటి క్రీడలను సాధన చేస్తుంటా. ఏటా అవయవ మార్పిడి జరిగేవారు పాల్గొనే వరల్డ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ గేమ్స్‌లోనూ ఉంటా. దేశ విదేశాల్లో పలుపోటీలు, మారథాన్‌లలోనూ పాల్గొని అవయవదానంపైనా.. గుండె మార్పిడి తర్వాత మంచి జీవనశైలితో ఆరోగ్యంగా ఉండొచ్చని అవగహన కలిగిస్తున్నా. మనకు దక్కిన విలువైన ఈ ఒకే ఒక్క జీవితాన్ని ఆపన్నులకు సాయం కోసమూ ఉపయోగించాలన్నదే నా ఆశయం. చివరి శ్వాస వరకు పేద రోగులకు ఆర్థిక చేయూత నందించడానికి కృషి మాత్రం ఆపను.

- రీనారాజు, లైట్‌ ఏ లైఫ్‌ ఎన్జీవో వ్యవస్థాపకురాలు, బెంగళూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్