అసలైన బంధం అదే!

ఓసారి అద్దం ముందు నిలబడి.. నాలో నేను ప్రేమించుకునే అయిదు అంశాలేంటి అని ఆలోచించా. చెప్పలేకపోయా.. ఆ క్షణం చాలా భయపడ్డా. డిప్రెషన్‌లోకి వెళ్లేలా చేసిన సందర్భమిది. ఇలా కాదని నన్ను నేను గమనించుకోవడం మొదలుపెట్టా.

Published : 20 Jan 2023 00:59 IST

సారి అద్దం ముందు నిలబడి.. నాలో నేను ప్రేమించుకునే అయిదు అంశాలేంటి అని ఆలోచించా. చెప్పలేకపోయా.. ఆ క్షణం చాలా భయపడ్డా. డిప్రెషన్‌లోకి వెళ్లేలా చేసిన సందర్భమిది. ఇలా కాదని నన్ను నేను గమనించుకోవడం మొదలుపెట్టా. ‘నన్ను నాలా స్వీకరిస్తా.. నన్ను నేను ప్రేమించుకుంటున్నా’ అని రోజూ అనుకోవడం మొదలుపెట్టా. నెల రోజుల్లో నాలో నాకు నచ్చే అంశాలు ఎన్ని కనిపించాయో! అమెరికాలో స్థిరపడ్డ తెలుగమ్మాయిని. 14 ఏళ్ల వయసులో ర్యాపర్‌ అవ్వాలనుకున్నా. పురుషాధిక్య రంగం. పోటీ కూడా ఎక్కువే. నా బరువు, రంగు, అందం.. అన్నింటిపైనా వ్యాఖ్యలే! ‘నీ ప్రతిభకు ఫిదా అయ్యాం. కాస్త బరువు తగ్గొచ్చుగా’ లాంటి సందేశాలు ఎన్ని చూసుంటానో. నా ప్రతిభకు నా శరీరమే అడ్డు అని ఎన్నోసార్లు ద్వేషించా కూడా. నన్ను నేనే ద్వేషించుకుంటున్నప్పుడు ఇతరులు చేయడంలో తప్పులేదు కదా అనిపించింది. అప్పట్నుంచి మారా. శరీర రంగు, కొలతల కంటే స్ఫూర్తి, పనిపై ప్రేమ, దాతృత్వం లాంటి లక్షణాలు ముఖ్యమని అర్థమయ్యాక నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టా. అప్పుడే ఇతరులనీ ప్రేమించగలం. ఎవరో ఏదో అన్నారని మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దు. మెచ్చే వాటిపై దృష్టి పెట్టండి. మీ ప్రధాన విధి అదే! మిమ్మల్ని మీరు స్వీకరించడంపై ఎంత సమయం వెచ్చిస్తే జీవితం అంత అందంగా కనిపిస్తుంది. ఈ లోకంలో మీతో మీకున్న అనుబంధమే అసలైన బంధం కూడా!

- రాజకుమారి, ర్యాపర్‌, గీత రచయిత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్