అమ్మాయిలా లేననేవారు!

నాన్నకి వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. తారల కుటుంబం అనగానే అన్నీ కాళ్ల ముందుంటాయి అనేస్తారు. మొదటి సినిమా అవకాశం రాగానే అదృష్టవంతురాలు.. తేలిగ్గా అవకాశం కొట్టేసిందంటూ కామెంట్లు.

Published : 22 Jan 2023 00:22 IST

నాన్నకి వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. తారల కుటుంబం అనగానే అన్నీ కాళ్ల ముందుంటాయి అనేస్తారు. మొదటి సినిమా అవకాశం రాగానే అదృష్టవంతురాలు.. తేలిగ్గా అవకాశం కొట్టేసిందంటూ కామెంట్లు. కానీ తెర వెనుక? చిన్నప్పటి నుంచే నేనూ ‘బాడీ షేమింగ్‌’ని ఎదుర్కొన్నా. నా బక్క పలుచని శరీరాన్ని చూసి ‘అబ్బాయిలా ఉన్నావ్‌.. అమ్మాయికి ఉండాల్సిన కొలతలే లేవ’నే వారు. నేనే ఎందుకిలా ఉన్నా.. నాకే ఎందుకిలా అవుతోంది. అందరూ నన్నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. నిజంగానే నాలో ఏదో లోపముందని చాలా బాధపడేదాన్ని. టీనేజర్‌ని.. ఎవరికి చెప్పాలో తెలియదు. ఇతరులతో పోల్చుకునేదాన్ని. ఓసారి బాధ అణచుకోలేక నా స్నేహితురాలితో పంచుకున్నా. తనదీ ‘బాడీ షేమింగ్‌’ సమస్యే.. అయితే తను లావు. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఇది నా ఒక్కదాని సమస్య కాదనిపించింది. అలాంటప్పుడు ఆలోచించి మనసు పాడుచేసుకోవడం ఎందుకనుకున్నా. నాకు నచ్చిన నటనపై దృష్టిపెట్టా. ఈసారి ముఖానికి, శరీర భాగాలకి సర్జరీ చేయించుకోవచ్చుగా అన్న సలహాలు. అమ్మాయి, నటి అంటే కొలతలేనా? వ్యక్తిత్వాన్నీ, ఆమె ప్రతిభనూ ఎందుకు చూడరు అని బాధేసేది. అయితే విమర్శలే కాదు.. వాటిని తిప్పికొడుతూ అండగా నిలుస్తున్నవారినీ చూశాక పట్టించుకోవడం మానేశా. నన్ను నేను నిరూపించుకోవడంపై దృష్టిపెట్టా. మిమ్మల్నీ ఎవరైనా అన్నారా.. నాలా నవ్వి ఊరుకోండి. ఎదగాలనుకున్న రంగంపై దృష్టిపెట్టండి. నేను సాధించా అని చెప్పను. నేర్చుకుంటున్నా.. మీరూ అదే చేయండి. ఏదో రోజు సాధించడం ఖాయం.

- అనన్య పాండే, నటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్