మా కోటకు స్వాగతం

‘అనగనగా ఒక యువరాణి..’ అంటూ కథల్లోనే కాదు దేశంలోనూ రాచరిక కుటుంబాల అమ్మాయిలున్నారు. ఒడిశాకు చెందిన యువరాణులే అక్షిత, మృణాళిక. రాచరిక పాలన పోయినా అలనాటి చరిత్రకు గుర్తులుగా నిలిచిపోయిన రాజసౌధాలెన్నో! వాటి చరిత్ర గొప్పతనం అలా కనుమరుగై పోవడమేనా? ఇదే ఆలోచించారా అక్కాచెల్లెళ్లు.

Updated : 22 Feb 2023 04:38 IST

‘అనగనగా ఒక యువరాణి..’ అంటూ కథల్లోనే కాదు దేశంలోనూ రాచరిక కుటుంబాల అమ్మాయిలున్నారు. ఒడిశాకు చెందిన యువరాణులే అక్షిత, మృణాళిక. రాచరిక పాలన పోయినా అలనాటి చరిత్రకు గుర్తులుగా నిలిచిపోయిన రాజసౌధాలెన్నో! వాటి చరిత్ర గొప్పతనం అలా కనుమరుగై పోవడమేనా? ఇదే ఆలోచించారా అక్కాచెల్లెళ్లు. ఆ గొప్పతనాన్ని నేటి తరాలకు తెలియజేయాలని తమ కోటనే పర్యటక ప్రాంతంగా మార్చారు.

భంజా రాజవంశంలో 48వ తరం అక్షిత, మృణాళికలది. వీళ్లది ఒడిశాలోని బారిపడ. 18వ శతాబ్దం నాటి బెల్గాడియా ప్యాలెస్‌.. వీళ్ల తరతరాల ఆస్తి. అయితే వీళ్ల చిన్నతనంలోనే కుటుంబం కోల్‌కతాకు మారిపోయింది. సెలవులు, వేడుకలప్పుడు మాత్రం ఇక్కడికి వస్తుండేవారు. అక్షిత పొలిటికల్‌ సైన్స్‌, హ్యూమన్‌ రైట్స్‌, మృణాళిక సోషియాలజీని విదేశాల్లో చదువుతున్నారు. కొన్నేళ్ల తర్వాత సెలవుల్లో ఎప్పట్లాగే తమ రాజభవనానికి చేరుకున్నారు. ‘మా పూర్వీకుల ఇల్లు ఆ రాజభవనం. వచ్చే పోయే బంధువులు, అతిథులతో ఎప్పుడూ కళకళలాడుతుండటమే మాకు గుర్తు. ఈసారి ఆ కళ అంతా కోల్పోయినట్లు అనిపించింది. తిరిగి సందడిగా మార్చాలంటే ఏం చేయాలా అని చాలా ఆలోచించాం. అప్పుడే దాన్నో పర్యటక ప్రాంతం చేయాలన్న ఆలోచన వచ్చింది. దీనిద్వారా అలనాటి సంస్కృతులు, ఆర్ట్‌, వారసత్వ సంపద అన్నింటిపై అవగాహనా కలిగించొచ్చు అనిపించింది’ అంటారీ అక్కాచెల్లెళ్లు.


ఇంకా మేం సాధించాల్సింది ఎంతో ఉంది. రాచకుటుంబాలు వేరే ప్రాంతాల్లో స్థిరపడటంతో వారసత్వ సంపదలైన ఎన్నో రాజప్రసాదాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. మాలాగే ఇంకొంతమంది ముందుకొస్తే వాటికి పూర్వవైభవం కల్పించొచ్చన్నదే మా ఆశ’ అంటున్నారు.


అమ్మానాన్నలతో ఆలోచన పంచుకుంటే వాళ్లూ సరేనన్నారు. అలా 2015లో ప్యాలెస్‌కి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే పనిలో పడ్డారు. ‘బొతిక్‌ హోటల్‌ పెట్టాలనుకున్నాం. వందల ఏళ్లనాటి స్వరూపం తేవడం కష్టమని తెలుసు. రాచరిక స్వరూపం మారకుండానే కొన్ని ఆధునిక సౌకర్యాలను జోడించాలి. ఇందుకు నాలుగేళ్లు పట్టింది. ఆ కాలంనాటి ఫర్నిచర్‌, షాండిలియర్లు, పెయింటింగ్‌లు, పురాతన వస్తువులు వగైరా సేకరించి, పెట్టడం పెద్ద సవాలే. అందుకే నాలుగేళ్లు పట్టింది. 2019లో తొలి అతిథులను ఆహ్వానించాం’ అని చెప్పే వీళ్లు పర్యావరణ హితానికీ ప్రాముఖ్యమిచ్చారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు చూపించారు. సంప్రదాయ వంటల నుంచి కళాకారుల నియామకం వరకు స్థానికులకే అవకాశమిచ్చారు. వందల ఏళ్లనాటి సంగీతం, నృత్యం, వివిధ కళలను ప్రదర్శించే ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో సంప్రదాయ చేతివృత్తులనూ ప్రోత్సహిస్తున్నారు. బస చేయడానికి వచ్చిన అతిథులకు చుట్టుపక్కల అందాలను చూసే ఏర్పాట్లు చేయడంతోపాటు చేతివృత్తులనూ పరిచయం చేస్తున్నారు. అలా వారికీ ఉపాధి దొరికేలా చేస్తున్నారు. వాళ్ల శ్రమ ఫలించి దేశీయంగానే కాదు పురాతన కట్టడాలపై ఆసక్తి ఉన్న కెనడా, జపాన్‌, యూరప్‌ దేశాల నుంచీ పర్యటకులు వస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్