గడ్డకట్టే చలిలో గిన్నిస్‌ రికార్డ్‌!

భూమికి వేల అడుగులెత్తులో ఉన్న ఆ సరస్సు ప్రాంతమంతా గడ్డకట్టిన మంచు. అడుగేస్తే జారిపోయే ఆ మంచుపై 30 ఏళ్ల స్తుతి భక్షి సాహసంతో మారథాన్‌ పూర్తి చేసి రికార్డు సాధించారు.  ఈ సాహసం వెనుక... ఆమె కృషిని తెలుసుకుందామా!  సముద్రానికి 13,862 అడుగులెత్తులో ఉండే పాంగాంగ్‌ ప్రపంచంలోనే అతిఎత్తైన గడ్డకట్టే సరస్సుగా పేరుంది.

Published : 27 Feb 2023 00:11 IST

భూమికి వేల అడుగులెత్తులో ఉన్న ఆ సరస్సు ప్రాంతమంతా గడ్డకట్టిన మంచు. అడుగేస్తే జారిపోయే ఆ మంచుపై 30 ఏళ్ల స్తుతి భక్షి సాహసంతో మారథాన్‌ పూర్తి చేసి రికార్డు సాధించారు.  ఈ సాహసం వెనుక... ఆమె కృషిని తెలుసుకుందామా!  

ముద్రానికి 13,862 అడుగులెత్తులో ఉండే పాంగాంగ్‌ ప్రపంచంలోనే అతిఎత్తైన గడ్డకట్టే సరస్సుగా పేరుంది. లద్ధాఖ్‌లో ఉన్న ఈ సరస్సులో నిర్వహించే ‘పాంగాంగ్‌ ఫ్రోజన్‌ లేక్‌ మారథాన్‌’లో ఈ ఏడాది పాల్గొన్న 100మందిలో తొమ్మిదిమంది మహిళలు కాగా, వీరిలో గుజరాత్‌కు చెందిన స్తుతి భక్షి ఒకరు. 21.9 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో పూర్తిచేసి విజేతగా నిలిచారీమె. దీంతో తక్కువ సమయంలో అతిఎత్తైన ప్రాంతంలో హాఫ్‌ మారథాన్‌ పూర్తిచేసిన మహిళగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్తుతి స్థానాన్ని పొందారు. గతంలో నాలుగు హాఫ్‌ మారథాన్‌లు పూర్తిచేసిన ఈమెకు ఇలా అతి ఎత్తైన ప్రాంతంలో మారథాన్‌ చేయడం మాత్రం మొదటిసారి. ‘ఇది నిజంగా నాకో పెద్ద సవాల్‌. ఎత్తైన ఈ ప్రాంతంలో అడుగుతీసి అడుగేయడమే సాహసం. అతి చల్లని ఈ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులొస్తుంటాయి. వెనుక నుంచి చల్లని ఈదురుగాలులు వేగంగా ముందుకు నెడుతుంటాయి.

ఇలాంటప్పుడు ఏటవాలుగా పేరుకున్న మంచుపై బ్యాలెన్స్‌ చేసుకుంటూ పరుగెత్తడం చాలా కష్టం. ఆ సమయంలో వెనుక నుంచి వీచే బలమైన గాలికి కిందపడిపోతామా అనిపిస్తుంది. ప్రతికూల వాతావరణాన్ని, పరిస్థితుల్ని తట్టుకోవడమెలాగో ఈ మారథాన్‌ నుంచి నేర్చుకొన్నా. ఇందులో పాల్గొనేందుకు చేసిన ఎంపిక కూడా క్లిష్టమైన ప్రక్రియే. ఇందుకు గతంలో మారథాన్‌ చేసిన అనుభవం ఉంటే మాత్రమే సరిపోదు. అతి చల్లని, ఎత్తైన ప్రాంతాల్లో అనుభవాలనూ లెక్కలోకి తీసుకుంటారు. నాకు మారథాన్‌లతోపాటు హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేసిన అనుభవం ఉంది. యోగా శిక్షకురాలిని కూడా. గతంలో చాలా రకాల సాహసక్రీడల్లో పాల్గొన్నా. ఇవన్నీ ఇందులో పాల్గొనడానికి అర్హతను సాధించిపెట్టి, గిన్నిస్‌ రికార్డులో చోటునూ అందించాయి’ అని వివరించారు స్తుతి భక్షి. ఈ హాఫ్‌ మారథాన్‌ను లద్ధాఖ్ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌, అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా నిర్వహించగా, ఇండియన్‌ ఆర్మీ, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు విభాగాలు నేతృత్వం వహించాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్