Published : 08/03/2023 00:35 IST

ఆమె.. చిత్రం!

ఆశయాల కోసం పరితపించారు.. ఏళ్లకొద్దీ శ్రమించారు. కోరుకున్న రంగంలో రాణించారు. ఒక చిత్రంతో ప్రజల మనసుల్లో చెరగరని ముద్రవేశారీ మహిళలు. ఆ చిహ్నాలే.. ఇవి!


63 దేశాల అభ్యర్థులతో పోటీపడి... 21 ఏళ్ల తర్వాత మిసెస్‌ వరల్డ్‌ కిరీటాన్ని సొంతం చేసుకుంది కశ్మీర్‌ యువతి సర్గమ్‌ కౌశల్‌. జాతీయ పక్షి నెమలిలా తయారై మురిపించిన వేళ...


గణతంత్ర దినోత్సవ వేడుకల్లో..  వాయుసేనకు చెందిన ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థ శకటానికి సారథ్యం వహించిన లెఫ్టినెంట్‌.. చేతనాశర్మ.


ఉద్యోగుల కష్టాలపై పంచులు విసురుతూ హాస్య స్ఫూర్తితో అయ్యో శ్రద్ధగా.. శ్రద్ధాజైన్‌ సామాజిక మాధ్యమాల్లో ఇన్‌ప్లుయెన్సర్‌గా పేరుతెచ్చుకుంది. ప్రధానితో ఆమె ముచ్చటించిన వేళ...


గ్రీన్‌ ఆస్కార్‌, ఐరాస అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ విజేత.. పక్షి ప్రేమికురాలు డాక్టర్‌ పూర్ణిమదేవి బర్మన్‌ పక్షులపై అవగాహన కలిగించే క్రమంలో..


తొలిసారి మహిళలు ఈ ఏడాది ప్రపంచకప్‌ అందుకున్నారు. తుదిపోరులో అర్చనా దేవి అందుకున్న ఈ క్యాచ్‌.. అందరినీ వాహ్‌ అనిపించడమే కాదు.. విజయంలో కీలకపాత్ర పోషించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి