Updated : 19/03/2023 03:01 IST

ఆమె రాకే.. మలుపు!

ఆమెకు సలాం

అనుష్క రాక ముందు నా ప్రపంచమంతా సాదాగానే అనిపించేది. రోజులన్నీ ఒకేలా ఉండేవి. తనని చూసిన క్షణమే కొత్త ప్రపంచం పరిచయమైంది. నిజానికి తనని చూసిన మొదటిరోజు నేనే కంగారుపడ్డా. తను మాత్రం చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. అది నన్నెంతో ఆశ్చర్యపరిచింది. అందుకే నా జీవితం మారిన క్షణమేదంటే ఆమె పరిచయమే అని చెబుతా! జీవితాన్ని కొత్త కోణంలో చూడటం అప్పుడే మొదలైంది. ప్రేమలో పడ్డాక ఎవరి జీవితంలోనైనా మార్పు సహజం అంటారు కదా! నిజమే.. ఇద్దరూ కలిసి నడవాలంటే కొంత మార్పు అవసరమే.. అయితే అది నా జీవితానికి పెద్ద మలుపు. మా పాప వామిక పుట్టాక మరెన్నో మార్పులు. ఓ భార్యగా, తల్లిగా అనుష్క ఎన్ని త్యాగాలు చేసిందో! ఆమెను చూశాక సమస్య ఏదైనా ధైర్యంగా ఎదుర్కోగలనని అనిపిస్తుంటుంది. జీవితం పట్ల ఆమె దృక్పథమే వేరు. తన నుంచి ఎన్నో సందర్భాల్లో స్ఫూర్తి పొందుతుంటా. ఎన్నో విషయాలు.. ముఖ్యంగా ఏం జరిగినా దాన్ని అంగీకరిస్తూ ముందుకు ఎలా సాగాలో నాకు తనే నేర్పింది. ప్రతి దశలోనూ అండగా ఉంది. ఆమెను చూశాక, తను ఎదుర్కొన్న సవాళ్లలో నావి 5 శాతం కూడా ఉండవనిపించింది. అంతలా నా దృక్పథాన్ని మార్చింది అనుష్క! అందుకే ఆమె నా జీవితంలో ప్రత్యేకం!

- విరాట్‌ కోహ్లీ, క్రికెటర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి