ఇవి తినేవి కావు...

తాజా పండ్లు, ఉడికించిన గుడ్లు, తొక్క ఒలిచిన కమలా తొనలు, పండ్లతో నిండిన ఐస్‌ కేక్స్‌, బిస్కట్లు చాక్లెట్లు, ఆకుకూరల సలాడ్స్‌, ఎండు చేపలు, పచ్చిచేపలు... వీటిన్నింటినీ ప్రదర్శనలో ఉంచితే అక్కడికొచ్చిన వారికి వాటిని చూసిు నోరూరిందట.

Updated : 29 Mar 2023 05:11 IST

తాజా పండ్లు, ఉడికించిన గుడ్లు, తొక్క ఒలిచిన కమలా తొనలు, పండ్లతో నిండిన ఐస్‌ కేక్స్‌, బిస్కట్లు చాక్లెట్లు, ఆకుకూరల సలాడ్స్‌, ఎండు చేపలు, పచ్చిచేపలు... వీటిన్నింటినీ ప్రదర్శనలో ఉంచితే అక్కడికొచ్చిన వారికి వాటిని చూసిు నోరూరిందట. కొందరైతే నోటిని అదుపు చేసుకోలేక.. రుచి చూద్దామని ప్రయత్నించి.. ఆపై నాలుక కరుచుకున్నారు కూడా! ఎందుకంటే ఇవన్నీ సబ్బులు మరి! రష్యాకు చెందిన జూలియా పొపోవా సృజనాత్మకత ఫలితమే ఇవి. సబ్బులు చేసే అభిరుచి ఉన్న ఈమె ఓసారి వినూత్నంగా ప్రయత్నిద్దామని ఓ గుర్రం బొమ్మను చేశారు. ఆపై పండ్లు, స్వీట్లు, చేపలు.. ఇలా ఒక్కోటీ చేస్తూ వెళ్లిపోయారు. వాటికి సహజత్వం అద్దడానికి వెనీలా, స్ట్రాబెర్రీ వంటి డిజర్ట్‌ ఫ్లేవర్స్‌నూ వీటికి కలుపుతున్నారు. మొదట్లో వీటిని స్నేహితులకు, బంధువులకు కానుకలుగా అందించి బోల్డన్ని ప్రశంసలు అందుకున్నారీమె. వాటి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచితే మాకూ చేసిమ్మని అందరూ అడగడం మొదలుపెట్టారట. ‘ఓంనాన్‌’ పేరుతో వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ.. జూలియా వ్యాపారవేత్తగానూ మారిపోయారు. తన అభిరుచిని ఆదాయంగా మార్చుకొని దానికి సృజనాత్మకత జోడిస్తుండటం భలేగుంది కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్