అనుసరించొద్దు... అనుకరించొద్దు

‘మహిళలం ఏ చేయగలం’ అనుకునే కంటే, ఏమైనా చేయగలమని భావిస్తే చాలు కొండంత ధైర్యం వచ్చేస్తుంది. మా ఇంట్లో ముగ్గురం ఆడపిల్లలమే. నాన్న చిన్నతనంలోనే చనిపోయారు.

Published : 26 May 2023 00:01 IST

 దివ్య సూర్యదేవర, జనరల్‌ మోటార్స్‌ మాజీ సీఎఫ్‌ఓ

‘మహిళలం ఏ చేయగలం’ అనుకునే కంటే, ఏమైనా చేయగలమని భావిస్తే చాలు కొండంత ధైర్యం వచ్చేస్తుంది. మా ఇంట్లో ముగ్గురం ఆడపిల్లలమే. నాన్న చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మ మమ్మల్ని పెంచడానికి రెక్కలు ముక్కలు చేసుకునేది. అప్పో సొప్పో చేసి చదివిస్తే చాలు... మేం ఉన్నతంగా స్థిర పడతామని నమ్మింది. కుటుంబం గడవడమే కష్టమైనా, రుణాలు తీసుకుని మరీ ఉన్నత చదువులకి అమెరికా పంపించింది. ఎంత కష్టపడుతున్నా ఆ విషయం మాకు తెలియకూడదనుకునేది. కానీ తన శ్రమ మాకు అర్థమవుతూనే ఉండేది. తను పెట్టుకున్న నమ్మకం, అంచనాలను చేరుకోవాలన్న తపనే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. లక్ష్యం కోసం శ్రమపడటంలోనూ ఎంతో సంతోషం ఉంటుందని ఆమెని చూసే అర్థం చేసుకున్నా. అమ్మ నన్ను ఎలా పెంచిందో నేను నా కూతురికి కూడా అవే విలువలు ఇవ్వాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ  ఆశలుంటాయి. మీ ఆశలను ఎలా నెరవేర్చుకోవాలో మీకంటే బాగా ఎవరికీ తెలియకపోవచ్చు. అలాగని ఇతరులను అనుకరించొద్దు. మన పరిస్థితులూ, ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలి. లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. అప్పుడే విజయాలు మనకు తోడవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్