ఆమె నమ్మకమే కోట్ల వ్యాపారమైంది

దేశీయ రుచులు బ్రాండ్స్‌గా ఎందుకు గుర్తింపు పొందవు? అదే జరిగితే వ్యాపారం విస్తృతమై గ్రామీణులకు ఉపాధి దొరుకుతుందన్న ఆలోచనతో మొదలైంది గో దేశీ ప్రయాణం.

Updated : 21 Jul 2023 05:06 IST

దేశీయ రుచులు బ్రాండ్స్‌గా ఎందుకు గుర్తింపు పొందవు? అదే జరిగితే వ్యాపారం విస్తృతమై గ్రామీణులకు ఉపాధి దొరుకుతుందన్న ఆలోచనతో మొదలైంది గో దేశీ ప్రయాణం. పట్టుదలుంటే ఏమైనా చేయగలమన్న నమ్మకం రక్షది. ఆ విశ్వాసమే చిరుతిళ్లకు దేశవ్యాప్త ఆదరణను తెచ్చిపెట్టింది. మరి ఆ వ్యాపార విశేషాలేంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే...

దైనా వ్యాపారం చేయాలి. అది వ్యవసాయానికి సంబధించినదై ఉండాలి అని ఎప్పుడూ అనుకునేదాన్ని. అలా వచ్చిన ఆలోచనే ఈ చింతపండు, పనస, అనాస, ఉసిరి,జామ బార్‌ల తయారీ. మాది బెంగళూరు. నేనో డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ని. పశ్చిమ కనుమల్లో ట్రెక్కింగ్‌కి వెళ్లిన అన్నయ్యకు చిన్న టీ దుకాణం కనిపించింది. అక్కడ చాలా చిరుతిళ్లు ఉన్నాయి. అందులోంచి పనస బార్‌ను తీసుకుని తింటే రుచి చాలా బాగుంది ‘వీటినే ఎందుకు మార్కెట్‌ చేయకూడదు’?. ఇలా చేస్తే ‘గ్రామీణ మహిళలకు ఉపాధి దొరుకుంది కదా’ అన్నారు. అక్కడి మహిళల్ని కలిసి 30 కిలోల బార్‌లను తయారుచేయించాం. కర్నాటకలోని ఒక ఎగ్జిబిషన్‌లో స్టాల్‌ పెట్టాం. మూడు రోజులకు స్టాల్‌ బుక్‌చేస్తే ఒక్క రోజులోనే స్టాక్‌ అంతా అయిపోయింది. అప్పుడే దేశీ రుచులకు ఉన్న డిమాండ్‌ తెలుసుకున్నాం.

ఉద్యోగం మానేస్తే ఎలా..

2018 ఏప్రిల్‌లో ఒక చిన్న రూమ్‌ అద్దెకు తీసుకున్నాం. అక్కడ ఇద్దరు మహిళలను నియమించుకుని అమ్మకాలు మొదలుపెట్టా. వీటికి ‘గో దేశీ’ అని పేరు పెట్టా. సమీప ప్రాంతాల్లోని దుకాణాలకు చేరవేయడమే లక్ష్యంగా అడుగులు వేశా. మేమున్న ప్రాంతంలో ఏ మూలకైనా స్కూటీ మీద వెళ్లి అన్నయ్య డెలివరీలు ఇచ్చేవారు. నా ఉద్యోగంతో పాటు ఉత్పతి,్త నాణ్యత, రుచి, ప్యాకింగ్‌, మార్కెటింగ్‌ విషయాలన్నీ నేను చూసుకునేదాన్ని. ఆర్డర్లు పెరిగాయి. నిలదొక్కుకోగలం అన్న నమ్మకం వచ్చింది. ఉద్యోగం మానేసి పూర్తి సమయాన్ని దీనికే కేటాయించాను. డిజిటల్‌ మార్కెటింగ్‌లో నాకున్న అనుభవంతో అన్ని ఆన్‌లైన్‌ వేదికల్లోనూ మా ఉత్పత్తులు ఉంచాను.

అంచెలంచెలుగా

ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమైన గో దేశీ ఇప్పుడు 300మంది మహిళలకు ఉపాధినిస్తుంది. వేలమంది వినియోగదార్లను సంపాదించుకుంది. గడిచిన ఆరునెలల్లో 32కోట్ల టర్నోవర్‌ను సాధించాం. అంతరించిపోతున్న రుచులను అందరికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏడాదికి ఒక కొత్త రుచిని తీసుకొచ్చాం. ఇప్పుడు 9 రకాల ఉత్పత్తులు మా దగ్గర లభ్యమవుతున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా 15వేల స్టోర్లలో ఈ విక్రయాలు జరుగుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్