విజిల్‌ వేస్తారు! బడికి రావాలి..

అక్కడ ఉదయాన్నే విజిల్‌ వినబడిందంటే దానర్థం.. మేం బడికి వచ్చేశాం. మీరూ వచ్చేయండని అర్థం. ఇదే పద్ధతి అంటారా? మావోయిస్టులు అధికంగా ఉండే జార్ఖండ్‌లోని సిందేగా జిల్లాలో బడి పిల్లల డ్రాపవుట్స్‌ని తగ్గించడానికి చేసిన ఓ ప్రయోగం.

Published : 07 Oct 2023 02:17 IST

అక్కడ ఉదయాన్నే విజిల్‌ వినబడిందంటే దానర్థం.. మేం బడికి వచ్చేశాం. మీరూ వచ్చేయండని అర్థం. ఇదే పద్ధతి అంటారా? మావోయిస్టులు అధికంగా ఉండే జార్ఖండ్‌లోని సిందేగా జిల్లాలో బడి పిల్లల డ్రాపవుట్స్‌ని తగ్గించడానికి చేసిన ఓ ప్రయోగం. ఆసక్తిగా ఉంది కదూ!

మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన ఝార్ఖండ్‌లోని సిందేగా జిల్లాలో బడి మానేస్తున్న పిల్లల సంఖ్య బాగా పెరిగిపోయింది. దాంతో స్థానిక జిల్లా యంత్రాంగం ‘సీటీ బజావ్‌-ఉపస్థితి బధావ్‌’ కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించింది. చదువులో చురుకుగా ఉండే కొందరు విద్యార్థులను మెంటర్స్‌గా ఎంపిక చేశారు. వీరంతా స్కూల్‌కు అందరికన్నా ముందుగా సిద్ధమై, విద్యార్థులున్న వీధులన్నీ తిరుగుతూ బడికి సిద్ధం కావాలని ఈల వేసి గుర్తు చేస్తున్నారు. తోటిపిల్లల్లో చైతన్యాన్ని నింపుతున్నారు. క్రమేపీ పిల్లల హాజరు పెరగడం మొదలైంది. దీంతో ఈ ‘సీటీ బజావ్‌-ఉపస్థితి బధావ్‌’ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా అమలుచేశారు. మెంటర్‌గా మారిన ప్రతి విద్యార్థి సుమారు 25మంది పిల్లలను బడిబాట పట్టించగలుగుతున్నారు. ‘చాలాకాలంగా ఎంతోమంది అమ్మాయిలు బడికి రాకుండా ఇంటి పనులకే పరిమితం అవుతున్నారు. అందుకే వాళ్లని తిరిగి చదువుకొనేలా ప్రోత్సహిస్తూ.. విజిల్‌ వేసి వారిని స్కూల్‌కు రప్పిస్తున్నాం. ఇలా తోటి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపగలుగుతున్నాం. ప్రతి గ్రామంలో 20 మంది ఇలా పనిచేస్తూ.. పిల్లల హాజరును 92 శాతానికి పెంచగలిగా’మంటోంది మెంటర్‌ ప్రియాంక కుమారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్