ఆంటీ.. లక్ష్మీదేవి పుట్టింది!

‘పాపా.. బాబా’ ప్రసవం చేసి, బయటికొచ్చిన డాక్టర్‌ నందినీకి ఎదురయ్యే ప్రశ్నే ఇది! దానిలో తప్పేముంది అనిపించడం సహజమే! కానీ పాప అన్న సమాధానం తర్వాత వాళ్ల ముఖాల్లో కనిపించే భావాలే ఆమెలో ఆందోళన పెంచేవి. వారి తీరులో మార్పు తేవడానికి ఆమె తీసుకున్న చిన్న నిర్ణయం ఎంతోమంది చిన్నారుల భవిష్యత్తును మారుస్తోంది.

Published : 15 Oct 2023 02:25 IST

‘పాపా.. బాబా’ ప్రసవం చేసి, బయటికొచ్చిన డాక్టర్‌ నందినీకి ఎదురయ్యే ప్రశ్నే ఇది! దానిలో తప్పేముంది అనిపించడం సహజమే! కానీ పాప అన్న సమాధానం తర్వాత వాళ్ల ముఖాల్లో కనిపించే భావాలే ఆమెలో ఆందోళన పెంచేవి. వారి తీరులో మార్పు తేవడానికి ఆమె తీసుకున్న చిన్న నిర్ణయం ఎంతోమంది చిన్నారుల భవిష్యత్తును మారుస్తోంది.

‘లింగ సమానత్వం.. దేశంలో అమ్మాయిలకూ సమాన అవకాశాలు అన్న మాటలు నాకు నమ్మాలి అనిపించదు. పుట్టిన క్షణం నుంచే ఆడపిల్లలు వివక్షను ఎదుర్కోవడం ప్రత్యక్షంగా చూస్తున్నా మరి. లేబర్‌ రూమ్‌లో గంటలపాటు ఎముకలు నలిపేసేంత నొప్పిని భరిస్తుందా తల్లి. పుట్టింది బాబు అయితే ఆనందం. పాప అన్న మరుక్షణం.. ఏదో కోల్పోయినట్లు ఏడుస్తోంటే ఒక ప్రాణాన్ని విజయవంతంగా ఈ లోకంలోకి తీసుకొచ్చామన్న ఆనందం క్షణంలో ఆవిరవుతుంది. అభం శుభం తెలియని ఆ పసికందును డెలివరీ రూమ్‌ నుంచి బయటకు తీసుకెళ్లి వాళ్ల వాళ్ల చేతికి ఇచ్చే ముందూ ‘పాపా.. బాబా’ అన్న ప్రశ్న. పాప అన్న సమాధానం రాగానే ముఖాలు మాడిపోతాయి. కొందరైతే మాకు అసలు వద్దంటూ ఆ చిన్నారిని బయట బెంచీ మీద వదిళెల్లిన సంఘటనలు కోకొల్లలు. దీనిలో మార్పునకు ఏదైనా చేయాలి అనిపించింది’ అంటారు డాక్టర్‌ నందినీ మోహతా.

ఈమెది ముంబయి. వైద్యవిద్య పూర్తిచేసిన ఆమె కొల్హాపూర్‌ ప్రభుత్వాసుపత్రిలో సేవలందిస్తున్నారు. రోజుకు సహజ ప్రసవాలే 20 వరకూ చేస్తారీ బృందం. ఆడపిల్లలపై ఆ వివక్ష చూడలేకపోయిన ఆమె ఓ చిన్న ఉపాయాన్ని ఆలోచించారు. ‘అబ్బాయైతే ‘బాబు’ అన్నమాట చాలు అవతలివారిలో ఆనందం నింపడానికి. అమ్మాయి విషయంలోనూ ఆ భావన కలగాలని వాళ్లు అడగకముందే ఆంటీ.. మహాలక్ష్మి మీ ఇంటికొచ్చింది. అదృష్టవంతులు.. స్వీటు తప్పక ఇవ్వాలి అని ఆనందంగా బిడ్డను వాళ్ల చేతిలో పెడతా. ఈ చిన్న మాటతో మార్పెలా అంటారా? అమ్మవారితో పోల్చాక అయిష్టత అయితే ప్రదర్శించరు. ఇంకా.. వైద్యుల చికిత్స కంటే దయతో కూడిన మాటలే ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. దాన్నే ఇక్కడా ఉపయోగిస్తున్నా. నెలరోజుల్లో కొందరిలోనైనా మార్పు కనిపించడం ఆనందమిస్తోంది. ఆ కుటుంబాల అనుమతితో పాపతో ఫొటోనీ తీసుకుంటా’ అంటోన్న నందినీ ఆలోచన అభినందనీయమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్