అమ్మాయిలను పూజిస్తారు..

వరంగల్‌ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు  నిర్వహిస్తారు. నవరాత్రుల్లో రోజుకో అమ్మాయిని అమ్మవారి స్వరూపంగా అర్చిస్తారు. మొదటి రోజు సంవత్సరం నిండిన పాప, రెండో రోజు రెండేళ్లు నిండిన అమ్మాయి ఇలా రోజుకొకరిని పూజిస్తూ తొమ్మిదో రోజు తొమ్మిదేళ్లు నిండిన అమ్మాయిని అర్చించడం ఇక్కడి ప్రత్యేకత.

Updated : 22 Oct 2023 10:06 IST

వరంగల్‌, భీమవరం

వరంగల్‌ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు  నిర్వహిస్తారు. నవరాత్రుల్లో రోజుకో అమ్మాయిని అమ్మవారి స్వరూపంగా అర్చిస్తారు. మొదటి రోజు సంవత్సరం నిండిన పాప, రెండో రోజు రెండేళ్లు నిండిన అమ్మాయి ఇలా రోజుకొకరిని పూజిస్తూ తొమ్మిదో రోజు తొమ్మిదేళ్లు నిండిన అమ్మాయిని అర్చించడం ఇక్కడి ప్రత్యేకత. భద్రకాళి అమ్మవారి జన్మదినోత్సవం దుర్గాష్టమి రోజే వస్తుంది (అక్టోబరు 22 ఆదివారం) ఈ రోజు భక్తులు జాగరణ ఉంటారు. నిత్యం అమ్మవారికి ఉదయం అభిషేకాలు చేస్తే ఈ ఒక్క రోజు మాత్రం రాత్రి వేళ కూడా చేస్తారు. దీన్ని మహారాత్రిగా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. పైగా నవరాత్రుల్లో నిత్యాన్నదానాన్ని రాత్రి వేళల్లో సైతం నిర్వహించి మహాప్రసాదం అందజేయడం ఇక్కడి మరో ప్రత్యేకత. ‘తెలంగాణలో మహిళలు అమ్మవారి స్వరూపంగా భావించి పేర్చే బతుకమ్మ కూడా భద్రకాళి స్వరూపమే.. భద్రమ్మే బతుకమ్మ అయ్యింది’ అంటారు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషుశర్మ. ఈ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు ఆషాఢమాసంలో 15 రోజులు శాకాంబరి ఉత్సవాల్లో సైతం రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు.

స్వర్ణ వస్త్రంతో శోభాయమానంగా..

దసరా రోజుల్లో అమ్మ అలంకరణ ఎక్కడైనా ప్రత్యేకంగానే ఉంటుంది. భీమవరంలోని మావుళ్లమ్మ అలంకరణ మరికాస్త ప్రత్యేకం. 51 కిలోల బంగారు ఆభరణాలతో అమ్మ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇక్కడ.. అమ్మవారు స్వర్ణవస్త్రంతో మెరిసిపోతే అంతరాలయం వెండిరంగులో వెలిగిపోతుంది. ఎక్కడాలేని విధంగా దసరారోజుల్లో నేరుగా మూలవిరాట్‌కే అలంకరించి పూజిస్తారు. దసరా రోజుల్లో మహిళలు బృందాలుగా ఏర్పడి లలితా సహస్ర నామపారాయణం, ఖడ్గమాలతో అమ్మవారిని అర్చిస్తారు. విదేశాల్లో స్థిరపడిన వారుసైతం ఈ రోజుల్లో అమ్మను చూడ్డానికి వస్తారని ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్