చూపు లేకపోయినా గెలిచింది!

చూపు లేకపోయినా.. జ్ఞాపకశక్తితో ఐఐఐటీ- లఖ్‌నవూలో సీటు సాధించింది 19ఏళ్ల భువికా అగర్వాల్‌. ముంబయికి చెందిన భువిక నెలలు నిండకుండా పుట్టింది.. పుట్టుకతోనే అంధురాలు. చూపు లేదన్న కారణంతో భువిక ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు.

Published : 28 Oct 2023 01:32 IST

చూపు లేకపోయినా.. జ్ఞాపకశక్తితో ఐఐఐటీ- లఖ్‌నవూలో సీటు సాధించింది 19ఏళ్ల భువికా అగర్వాల్‌. ముంబయికి చెందిన భువిక నెలలు నిండకుండా పుట్టింది.. పుట్టుకతోనే అంధురాలు. చూపు లేదన్న కారణంతో భువిక ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అమోఘమైన తన జ్ఞాపకశక్తే అందుకు కారణం. చాలా చిన్నతనం నుంచే ఆంగ్ల వర్ణమాలని వెనక నుంచి ముందుకి టకటకా చెప్పేది భువిక. రీజనింగ్‌లోనూ ప్రావీణ్యం ఉంది. ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని.. 2019లో బెంగళూరులో జరిగిన హ్యాకథాన్‌లో ప్రథమ బహుమతి గెల్చుకొంది.

లక్ష్యంతో.. భువిక తాననుకున్న లక్ష్యాన్ని సాధించే మార్గంలో వైకల్యాన్ని ఎప్పుడూ.. అడ్డుగోడగా భావించలేదు. ‘ఐఐఐటీలో చేరాలనే లక్ష్యం చిన్నప్పట్నుంచే ఉంది. కానీ జేఈఈ పరీక్ష కఠినమని అందరూ చెప్పేవారు. కష్టం అనేమాటను పక్కనపెట్టి, దాన్ని ఎలా గెలవాలా అని మాత్రమే ఆలోచించా. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌లో మంచి మార్కులు సాధించడానికి ఎక్కువ కృషి చేశా. అన్నింటిలోనూ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ రాయడం ఇబ్బందయ్యింది. ఎందుకంటే, వీటి సమీకరణాలు స్క్రైబ్‌కు వివరించడం కష్టం.మనసులోనే వాటిని ఊహించుకుని తుది సమాధానం మాత్రం చెప్పేదాన్ని. అనుకున్నట్లుగానే ఈ మూడు సబ్జెక్టుల్లో మంచి స్కోరు వచ్చింది. జేఈఈలో 1,081 ర్యాంకు సాధించా. ఐఐఐటీ-లఖ్‌నవూలో చోటు సంపాదించా. అక్కడ దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలున్నా కూడా సాధారణ విద్యార్థుల్లాగే చదువుకుంటా’నంటున్న భువికా కోడింగ్‌లో అందరితో సమానంగా రాణిస్తోంది. భవిష్యత్తులో మొబైల్‌ డిజైనింగ్‌ను కెరియర్‌గా మలుచుకుంటానంటున్న భువిక అందరికీ స్ఫూర్తిదాయకం కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్