సాగరకన్యలా మారి..!

మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌... పోటీల గురించి విన్నాం. మరి మిస్‌ ఓషన్‌ వరల్డ్‌ పోటీల గురించి విన్నారా? అందానికి, సామాజిక హితాన్ని జోడించిన పోటీలివి.

Updated : 03 Nov 2023 02:33 IST

మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌... పోటీల గురించి విన్నాం. మరి మిస్‌ ఓషన్‌ వరల్డ్‌ పోటీల గురించి విన్నారా? అందానికి, సామాజిక హితాన్ని జోడించిన పోటీలివి. అందమైన సముద్ర తీరాలని చెత్త, చెదారంతో పాడు చేయడం ఎంత వరకూ సమంజసం? ఎన్నో జలచరాలు జీవించే సుందర సాగరగర్భాన్ని కాలుష్యంతో ముంచెత్తడం న్యాయమా? ప్రజలకి జల కాలుష్యంపై అవగాహన తెచ్చేందుకే ఈ పోటీలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. భారత్‌లో తొలిసారి నిర్వహించిన ఈ పోటీల్లో 12 దేశాలకు చెందిన యువతులు తుదిపోరులో పాల్గొంటే యూకేకు చెందిన లారా మొదటి స్థానం సంపాదించారు. లారాని మెర్‌మెయిడ్‌ ట్వింకిల్‌ అనీ వాటర్‌ బేబీ అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. లండన్‌లో మొదటి మెర్‌మెయిడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పేరుగాంచిన లారా డైవింగ్‌ నిపుణురాలు. సాగరకన్యలా తయారై పిల్లలకు సముద్ర గర్భాలు, జలకాలుష్యంపై అవగాహన తీసుకురావడానికి కృషి చేస్తోందీమె. ఇక భారత్‌కు చెందిన అవంతి కూడా ఈ పోటీల్లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈమెది ముంబయి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. ‘అందాల కిరీటాన్ని అందుకోవాలన్నది నా చిన్ననాటి కల. గతంలో చాలా పోటీల్లో గెలిచినప్పటికీ.. ఈ పోటీలు చాలా ప్రత్యేకమైనవి. వివిధ సామాజిక సంస్థలతో కలిసి సముద్ర తీరాల్ని శుభ్రం చేసే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఆ అనుభవమే ఈ పోటీల్లో గెలవడానికి ఉపయోగపడింది’ అంటోంది అవంతీష్రాఫ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్