వావ్‌ అని.. స్టార్‌ అయ్యింది!

‘సో బ్యూటీఫుల్‌.. సో ఎలిగెంట్‌.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఎ వావ్‌’.. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ ఏది తెరిచినా ఈ మాటలతో రీల్స్‌, షార్ట్స్‌ తెగ సందడి చేస్తున్నాయి. తారలూ ఇందుకు మినహాయింపు కాదు.

Updated : 19 Nov 2023 04:50 IST

‘సో బ్యూటీఫుల్‌.. సో ఎలిగెంట్‌.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఎ వావ్‌’.. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ ఏది తెరిచినా ఈ మాటలతో రీల్స్‌, షార్ట్స్‌ తెగ సందడి చేస్తున్నాయి. తారలూ ఇందుకు మినహాయింపు కాదు. మొన్నటికి మొన్న దీనిపై దీపికా పదుకోణ్‌ రీల్‌ చేస్తే.. కోటికి పైగా వీక్షణలు. తర్వాత ఓ హాలీవుడ్‌ పాప్‌స్టార్‌.. ఇంకా బాలీవుడ్‌ తారలు రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, ఫరాఖాన్‌, నిక్‌ జోనాస్‌.. ఇలా ఎవరు దీన్ని ఉపయోగించినా ఇదే స్పందన. ఇంతకీ ఈ ట్రెండింగ్‌ డైలాగ్‌ ‘వావ్‌’ను ఉపయోగించిందెవరో తెలుసా? దిల్లీకి చెందిన జస్మీన్‌ కౌర్‌. దిల్లీ, ఫతేనగర్‌కు చెందిన ఈమె చిన్న బొటిక్‌ నిర్వహిస్తోంది. ఇన్‌స్టాలో ఈమెను 5 లక్షలమంది అనుసరిస్తున్నారు. ఓసారి లైవ్‌లో దుస్తులను అమ్ముతూ ‘ఈ డ్రెస్‌ని చూడండి. చాలా అందంగా ఉంది. సో బ్యూటీఫుల్‌, సో ఎలిగెంట్‌, జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఎ వావ్‌’ అని అభివర్ణించింది. అది కాస్తా యువతతోపాటు తారలనూ ఆకర్షించింది. అంతేనా.. ఆమె ఆన్‌లైన్‌లో దుస్తులను పరిచయం చేస్తూ వాడే ‘లడ్డూ పీలా, బ్లడ్‌ రెడ్‌, మౌస్‌ కలర్‌.. ’ వంటి పదాలకీ ఆదరణ పెరిగింది. ఇకంతే.. ఈ డైలాగులతో రీల్స్‌, మీమ్స్‌ పెరిగిపోయాయి. ఈమెకు దక్కుతున్న ఆదరణ చూసి ఏకంగా ఓ ఆహార సంస్థ ఆమెని ప్రచారకర్త చేసుకుంది. పేపర్‌, టీవీ ఇంటర్వ్యూలకైతే కొదవే లేదు. ఈమె డైలాగులతో బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ఏకంగా పాటనే విడుదల చేశారంటే సోషల్‌ మీడియాలో ఆ మాటలకి ఎంత ఆదరణ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. జస్మీన్‌ మాత్రం.. ‘ఒక్కసారిగా అదృష్టం వరించినట్టుంది. ఇంటర్వ్యూలు అడుగుతోంటే సెలబ్రిటీనన్న భావన కలుగుతోంది. నా వ్యాపారానికీ ఆదరణ పెరిగిం’దంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది. చిన్న వాక్యంతో సెలబ్రిటీ హోదా మరి.. ‘వావ్‌’ అనిపించడం మామూలే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్