మూలాలు మరచిపోని చేతన!

చేతన మారూ.. భారతీయ మూలాలున్న బ్రిటిష్‌ రచయిత్రి. ఈమెది లండన్‌. చేతన రాసిన తొలి నవల ‘వెస్ట్రన్‌ లేన్‌’-2023 బుకర్‌ ప్రైజ్‌ తుది జాబితాలో స్థానం సంపాదించడంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

Updated : 29 Nov 2023 13:15 IST

చేతన మారూ.. భారతీయ మూలాలున్న బ్రిటిష్‌ రచయిత్రి. ఈమెది లండన్‌. చేతన రాసిన తొలి నవల ‘వెస్ట్రన్‌ లేన్‌’-2023 బుకర్‌ ప్రైజ్‌ తుది జాబితాలో స్థానం సంపాదించడంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇందులో విజేతగా నిలవలేకపోయినా విమర్శకుల మనసులు దోచుకుందీ పుస్తకం. బ్రిటిష్‌- గుజరాతీ కుటుంబాల నేపథ్యంలో ఈ కథను రాసింది. ఈ నవలను ప్రముఖ అమెరికన్‌ ప్రచురణ సంస్థ ఎఫ్‌ఎస్‌జీ ప్రచురించింది. గోపీ అనే పదకొండేళ్ల అమ్మాయి చుట్టూ అల్లుకున్న భావోద్వేగాల సమాహారమే ఈ పుస్తకం. తల్లి చనిపోయాక తండ్రి సంరక్షణలో ఉంటుంది. అప్పుడామె స్క్వాష్‌ క్రీడలో శిక్షణ తీసుకోవడం, ఈ క్రమంలోనే అమ్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సాగిన తీరు చదువరులను కట్టిపడేస్తుంది. సంక్లిష్టమైన మానవ భావోద్వేగాలకు రూపకంగా దీన్ని ఉపయోగించుకున్నందువల్లే విమర్శకుల ప్రశంసల్నీ అందుకుందీ పుస్తకం. చేతన రచయిత్రిగా పేరు తెచ్చుకోవడానికి ముందు కొన్నాళ్లు అకౌంటెంట్‌గా పనిచేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్