ఈ కిరీటం వాళ్ల కోసమే...

ఫ్యాషన్‌ దుస్తులతో ర్యాంప్‌వాక్‌ చేసే అందాల పోటీ కాదిది. దీని వెనుక సామాజికసేవ దాగుంది. అటువంటి పోటీలో తెలుగింటి ఆడపడుచు రాధికా నాయుడు ‘మిసెస్‌ గోల్డెన్‌ ఫేస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌-2024’ టైటిల్‌ సొంతం చేసుకున్నారు.

Updated : 07 Feb 2024 03:59 IST

ఫ్యాషన్‌ దుస్తులతో ర్యాంప్‌వాక్‌ చేసే అందాల పోటీ కాదిది. దీని వెనుక సామాజికసేవ దాగుంది. అటువంటి పోటీలో తెలుగింటి ఆడపడుచు రాధికా నాయుడు ‘మిసెస్‌ గోల్డెన్‌ ఫేస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌-2024’ టైటిల్‌ సొంతం చేసుకున్నారు.

యాసిడ్‌ బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడినా.. కాలిన చోట తిరిగి చర్మం రాకపోవడం వారిని తీవ్ర వేదనకు గురి చేస్తుంటుంది. గత రూపాన్ని తిరిగి పొందలేమనే బాధ మొదలవుతుంది. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. నలుగురితో కలవడానికి ఆసక్తి చూపించలేక, సొంతవారి ఆదరణ నోచుకోక ఒంటరిగా మిగిలిపోతారు. ఆర్థికంగా నిలబడలేరు. ఇటువంటివారికి పూర్వపు రూపం తేలేకపోయినా.. చర్మం కాలిన చోట కొత్త చర్మాన్ని ఉంచి చికిత్స నిర్వహిస్తే కొంత ఫలితం ఉంటుంది. ఇలా జరగాలంటే అవయవదానంలాగే చర్మ దానమనేది ఒకటి ఉందని అందరికీ తెలియాలి. ఈ అవగాహన అందరిలో నింపి యాసిడ్‌ బాధితులకు చేయూతగా నిలవాలనుకుంది ఓ ప్రైవేటు సంస్థ. దీని కోసం ‘గోల్డెన్‌ ఫేస్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా-2024’ పేరిట అందాల పోటీని నిర్వహించింది. ఇందులో హైదరాబాద్‌ నుంచి పాల్గొన్న రాధికానాయుడు ‘మిసెస్‌ గోల్డెన్‌ ఫేస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌-2024’ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఇటీవల జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో తన అందంతోపాటు తనదైన వ్యక్తిత్వంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అమీ జాక్సన్‌, శ్రియా శరణ్‌ వంటి ప్రముఖుల ప్రశంసలనూ అందుకున్నారు. క్యాప్‌జెమినీ టెక్నాలజీ సర్వీసెస్‌లో టీమ్‌ లీడర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాధిక అటు ఉద్యోగినిగా, ఇటు ఇల్లాలిగా బాధ్యతలను సమన్వయం చేస్తూనే.. అందాల పోటీలోనూ విజయాన్ని సాధించి, యాసిడ్‌బాధితులకు సాయమందేలా తన వంతు కృషి చేస్తానని చెప్పడం హర్షించదగ్గ విషయమే కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్