బాటిల్‌లో కాఫీ... న్యూస్‌పేపర్‌ మెనూ...

కాఫీ గాజు బాటిల్‌లో తాగితే.. బస్‌స్టాప్‌ను కావాల్సిన చోటుకి మార్చుకుంటే..రెస్టరంట్లలో మెనూ న్యూస్‌పేపర్‌లా ఎందుకు ఉండకూడదు.. రొటీన్‌కి భిన్నంగా, సృజనాత్మకంగా ఉండేవారి ఆలోచనలే కదా ఇవన్నీ.

Updated : 02 Mar 2024 06:45 IST

కాఫీ గాజు బాటిల్‌లో తాగితే.. బస్‌స్టాప్‌ను కావాల్సిన చోటుకి మార్చుకుంటే..రెస్టరంట్లలో మెనూ న్యూస్‌పేపర్‌లా ఎందుకు ఉండకూడదు.. రొటీన్‌కి భిన్నంగా, సృజనాత్మకంగా ఉండేవారి ఆలోచనలే కదా ఇవన్నీ. ఇవే బెంగళూరుకి చెందిన ఆర్కిటెక్ట్‌, ‘స్టూడియో సార్టెడ్‌’ కో- ఫౌండర్‌ ‘నేత్ర అజ్జంపుర్‌’ ను ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకునేలా చేశాయి. అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌, ఆపై ఐఐఎమ్‌ బెంగళూరులో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేసింది నేత్ర. తరవాత తన స్నేహితుడు అభిషేక్‌ దురానీతో కలిసి స్టూడియో సార్టెడ్‌ డిజైనింగ్‌ కంపెనీని స్థాపించింది.

టోనీ అండ్‌ గై, ఎమ్‌జీ, సోనీ మ్యూజిక్‌, వాదం, జేబీఎల్‌, తేకా కాఫీ...లాంటి ఎన్నో సంస్థలకు బ్రాండింగ్‌, ఇంటీరియర్‌, క్యూరేషన్‌.. లాంటి సేవలను అందిస్తోంది నేత్ర. ఈమె ‘2023 మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఆంత్రప్రెన్యూర్‌ అండ్‌ డిజైనర్‌’ అవార్డునూ గెలుచుకుంది. నేత్ర సృజనాత్మకతకు బెంగళూరులో చేపట్టిన  ‘మొబైల్‌ బస్‌స్టాప్‌’ ప్రాజెక్టు ఓ మచ్చుతునక. బస్సు కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో ఈ మొబైల్‌ బస్‌స్టాప్‌లను ఉంచుతారు. దాంతో ఇవి ఉన్నచోట బస్సులు ఆగుతాయి. ఇవి అక్కడ ఉండే ఇన్‌ఫార్మల్‌ వర్కర్లకు, ముఖ్యంగా మహిళలకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. గతేడాది ఐఐఎమ్‌ బెంగళూరులో జరిగిన గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ 10కే విమెన్‌ ప్రోగ్రామ్‌కీ ఎంపికైం దీమె. ఇండియా డిజైన్‌, ఆర్కిటెక్చర్‌లో ప్రత్యేక ముద్ర వేస్తోన్న ఈ యువ కెరటం తాజాగా ఫోర్బ్స్‌ ఇండియాబ30 అండర్‌ 30 జాబితాలో చోటు దక్కించుకుని, చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకుంది!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్