సరిహద్దుల్లో ‘ఆమె’ సైన్యం!

‘దేశ రక్షణ బాధ్యత మాది కూడా’ అంటూ పోరాడారు మహిళలు. ఆ హక్కు సంపాదించుకుని వివిధ రక్షణ విభాగాల్లోకి అడుగుపెట్టారు. దేశ సరిహద్దుల్లో, సియాచిన్‌ వంటి ప్రమాదకర ప్రాంతాల్లోనూ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వారి సత్తా నిరూపించుకునేలా మరో అడుగు ముందుకు పడింది.

Published : 05 Apr 2024 01:56 IST

‘దేశ రక్షణ బాధ్యత మాది కూడా’ అంటూ పోరాడారు మహిళలు. ఆ హక్కు సంపాదించుకుని వివిధ రక్షణ విభాగాల్లోకి అడుగుపెట్టారు. దేశ సరిహద్దుల్లో, సియాచిన్‌ వంటి ప్రమాదకర ప్రాంతాల్లోనూ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వారి సత్తా నిరూపించుకునేలా మరో అడుగు ముందుకు పడింది. సరిహద్దుల్లో ఏకంగా మహిళా జవాన్లతో కూడిన ‘బోర్డర్‌ అవుట్‌పోస్ట్‌’ (బీఓపీ) ఏర్పాటు చేయనున్నట్లు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) వెల్లడించింది. సరిహద్దుల్లో దాయాది దేశాల కవ్వింపులు, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు, మనుషుల అక్రమరవాణా, చొరబాటుతనం వంటివాటికి ఆస్కారమెక్కువ. దేశంలోకి ప్రవేశించకుండా తనిఖీలు చేపట్టాలి. వివాదాలు, అల్లర్లు వంటివీ సహజమే. వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ పహారా కాయాలి. ఈ సామర్థ్యం మహిళా జవాన్లకు ఉందని బీఎస్‌ఎఫ్‌ నమ్మింది. అందుకే జైసల్మేర్‌లోని షాగఢ్‌ బల్జ్‌ వద్ద పూర్తిగా మహిళలతో కూడిన అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇది ప్రారంభం మాత్రమే. విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరిన్ని ఏర్పాటుచేసి, మరింతమంది మహిళా జవాన్లకు సరిహద్దు రక్షణ బాధ్యత అప్పగిస్తామంటున్నారు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ నితిన్‌ అగర్వాల్‌. ఇందుకు సంబంధించిన ప్రత్యేక శిక్షణనీ ఇస్తున్నారట. మనవాళ్లు ఇక్కడా సత్తా చాటి, మరెందరికో మార్గదర్శకులవ్వాలని ఆశిద్దామా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్