ఐపీఎల్‌ వేడుకల్లో... సిక్కోలు నాట్యం!

ఐపీఎల్‌ మ్యాచులకుండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ప్రపంచం మొత్తం చూసే ఈ మ్యాచుల్లో మన తెలుగమ్మాయిల కళాసృజన తళుక్కున మెరిస్తే? చిదంబరం స్టేడియంలో అదే జరిగింది.

Published : 10 Apr 2024 02:13 IST

ఐపీఎల్‌ మ్యాచులకుండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ప్రపంచం మొత్తం చూసే ఈ మ్యాచుల్లో మన తెలుగమ్మాయిల కళాసృజన తళుక్కున మెరిస్తే? చిదంబరం స్టేడియంలో అదే జరిగింది. నాట్యకారిణి కీర్తిప్రియ కళాభిమానమే ఇందుకు కారణం...

చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో గత నెల 22న ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన శ్రీకూచిపూడి నృత్య విద్యాలయం కళాకారులు అద్భుతమైన నాట్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. గత పన్నెండేళ్లుగా ఈ నృత్యాలయం విద్యార్థులు కోల్‌కతా, బెంగళూరు, మలేసియా, దుబాయ్‌ సహా అనేక చోట్ల నృత్య ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్నారు. వీరిని ఇంతలా ప్రోత్సహిస్తుంది ఈ నృత్యాలయాన్ని స్థాపించిన కీర్తిప్రియనే. ‘కోల్‌కతాలో ప్రదర్శన చేస్తుండగా అక్కడికి వచ్చిన ఐపీఎల్‌ కోఆర్డినేటర్‌కి మా నృత్యం బాగా నచ్చింది. దాంతో మా వివరాలు తీసుకుని గత నెల మమ్మల్ని సంప్రదించారు. నేను నేర్చుకున్న విద్యను ఉచితంగా అందరికీ నేర్పాలని ఆశయంగా పెట్టుకున్నాను. అందుకే 2020లో వివాహమై లండన్‌ వెళ్లిపోయినా... అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నా’.. అంటున్నారు కీర్తిప్రియ. నరసన్నపేటకి చెందిన ఈమె ఏటా 200 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వీరిలో ఆసక్తి ఉన్నవారిని ఓరియంటల్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ లండన్‌ పరీక్షలకు వెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నారు.

కోన శివ ఈజేఎస్‌, శ్రీకాకుళం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్