ఈ అమ్మాయిలు... యునిసెఫ్‌ అంబాసిడర్లు!

పిల్లల హక్కులకోసం పోరాడే యునిసెఫ్‌ ఇండియా బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ని  జాతీయ అంబాసిడర్‌గా నియమించింది. ఆమెతో పాటు మొదటిసారి నలుగురిని యూత్‌ అడ్వొకేట్స్‌గానూ నియమించింది. అందులో  ముగ్గురు అమ్మాయిలు.

Published : 06 May 2024 02:08 IST

పిల్లల హక్కులకోసం పోరాడే యునిసెఫ్‌ ఇండియా బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ని  జాతీయ అంబాసిడర్‌గా నియమించింది. ఆమెతో పాటు మొదటిసారి నలుగురిని యూత్‌ అడ్వొకేట్స్‌గానూ నియమించింది. అందులో  ముగ్గురు అమ్మాయిలు. వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గౌరాన్షీ శర్మ, తమిళనాడుకు చెందిన పర్యావరణ వేత్త, ఇన్నోవేటర్‌ వినీషా ఉమాశంకర్‌, అసోంకి చెందిన సింగర్‌ నాహిద్‌ అఫ్రిన్‌లు ఉన్నారు.

కరీనా కపూర్‌ మంచి నటే కాదు, సామాజిక స్పృహ ఉన్న మహిళ కూడా. గత పదేళ్లుగా యునిసెఫ్‌ ఇండియా, సెలెబ్రిటీ అడ్వొకేట్గ్‌ా పనిచేసిన ఈమె... ఇమ్యునైజేషన్‌, బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వంటి అనేక విషయాలపై అవగాహన కల్పించారు. కొవిడ్‌-19 సమయంలో పిల్లల చదువు, తిరిగి వారిని స్కూళ్లకు పంపడంపై అనేక సలహాలూ ఇచ్చారు ‘ప్రపంచ భవిష్యత్తు పిల్లలపైనే ఉంటుంది. వారి హక్కులు కాపాడడం చాలా కీలకం. ఈ బృహత్తర బాధ్యతను నా మీద ఉంచడం, గౌరవంగా భావిస్తున్నా. అభాగ్యులైన పిల్లల హక్కుల కోసం ప్రత్యేకించి వారి విద్య, ఆరోగ్యం, లింగ సమానత్వం వంటి విషయాల్లో నా గొంతును వినిపిస్తా.’ అంటారామె.

కలల్ని చెదరనివ్వలేదు...

మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ గౌరాన్షీ శర్మ...  బధిరురాలు. ఏడేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందిన గౌరాన్షీ, 2021లో బ్రెజిల్‌లో జరిగిన డెఫ్‌లింపియాడ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. యునిసెఫ్‌కు ‘రైట్‌ టు ప్లే అండ్‌ డిజేబిలిటీ ఇన్‌క్లూజన్‌’ పై సలహాలివ్వబోతోంది.

పర్యావరణంపై ప్రేమతో...

చిన్న వయసులోనే పర్యావరణంపై సృహ పెంచుకుంది వినీషా ఉమాశంకర్‌. ఆమెది తమిళనాడు. ఓ రోజు స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా ఇస్త్రీ చేసే వ్యక్తి వృథా బొగ్గుని... చెత్తలో పారేయడం గమనించింది. అది పర్యావరణంపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలని పరిశోధన చేసింది. దాన్నుంచి వెలువడే పొగ ఊపిరితిత్తుల వ్యాధులు కలిగిస్తాయని తెలుసుకుంది. ఆపై ప్రయోగాలు చేసి ప్రత్యామ్నాయంగా  ‘సోలార్‌ ఐరనింగ్‌ కార్‌’్టను తయారుచేసింది. చిన్న వయసులోనే ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ ఫైనలిస్ట్‌గా నిలిచింది. పర్యావరణ పరిరక్షణపై కాప్‌26 సదస్సులోనూ ప్రసంగించింది. శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి ఇంటర్నేషనల్‌ యంగ్‌ ఎకో హీరో అవార్డునూ అందుకుంది. నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ అందజేసే డాక్టర్‌ అబ్దుల్‌ కలాం ఇగ్నైట్‌ అవార్డునూ అందుకుంది. ఈ కృషి వల్లే వినీషాను యునిసెఫ్‌... ‘ఇన్నోవేషన్‌, స్టెమ్‌’ విభాగాల్లో అడ్వొకేట్‌గా నియమించింది.

మానసిక ఆరోగ్యంకోసం...

నాహిద్‌... ఇండియన్‌ ఐడల్‌ జూనియర్స్‌ రన్నరప్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌. సైకాలజీ విద్యార్థిని కూడా. మానసిక ఆరోగ్యం, ఎర్లీ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌లపై సలహాదారుగా పనిచేయనుంది. ‘ప్రస్తుతం యువత ఎదుర్కొంటోన్న మానసిక సమస్యల పరిష్కారానికి నా గొంతు వినిపించనున్నా. ఇది నాకు దక్కిన గొప్ప అవకాశం’ అంటోంది నాహిద్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్