ఆ గౌను కోసం... పదివేల గంటలు!

అంబానీల యువరాణి ఇషా అంబానీ ఏం చేసినా సంచలనమే! తాజాగా ఫ్యాషన్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్‌ అయిన మెట్‌ గాలా వేదికపై చీర గౌను ధరించి అందరినీ ఔరా అనిపించింది.

Published : 08 May 2024 02:36 IST

అంబానీల యువరాణి ఇషా అంబానీ ఏం చేసినా సంచలనమే! తాజాగా ఫ్యాషన్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్‌ అయిన మెట్‌ గాలా వేదికపై చీర గౌను ధరించి అందరినీ ఔరా అనిపించింది. అంత ప్రత్యేకత దానిలో ఏముందంటారా? భారతీయ డిజైనర్‌ రాహుల్‌ మిశ్రా కోషర్‌ శారీగౌనుని డిజైన్‌ చేశారు. పూలు, సీతాకోకచిలుకలు, తూనీగలు... వంటి సిగ్నేచర్‌ మోటిఫ్‌లు దీనిపై కనువిందు చేశాయి. అంతేకాదు, వీటిని ఫరీషా, జర్దోసీ, నక్షి, దబ్కా, ఆప్లిక్‌, ఫ్రెంచ్‌ నాట్స్‌... వంటి ఎన్నో రకాల ఎంబ్రాయిడరీలతో తీర్చిదిద్దిన ఘనత వందల భారతీయ గ్రామాల చేతి వృత్తుల కళాకారులదంటే ఆశ్చర్యపోవాల్సిందే. దీనికితోడు ఆరు గజాల ఈ 3డీ చీర గౌనుకు జతగా కోర్సెట్‌ బ్లౌజ్‌ అదరహో అనిపించింది. ఇవన్నీ ఈ ఏడాది మెట్‌ గాలా థీమ్‌ ‘స్లీపింగ్‌ బ్యూటీస్‌: రీఅవేకనింగ్‌ ఫ్యాషన్‌’, ‘ది గార్డెన్‌ ఆఫ్‌ టైమ్‌’కి అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ డ్రెస్‌ పూర్తి చేయడానికి సుమారు 10,000 గంటలు, అంటే ఏడాదికి పైగానే సమయం పట్టిందట. ఈ శారీగౌనుపైకి ప్రకృతి ప్రేరణగా తీర్చిదిద్దిన ఆభరణాలు....చిలుకల చెవిపోగులు, పూల చోకర్‌ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఇక, నకాషీ పనితనం, మినియేచర్‌ పెయింటింగ్‌తో భారతీయ కళ ఉట్టిపడేలా తీర్చిదిద్దిన నెమలి ఫీచర్డ్‌ బ్యాగ్‌ వంటివి ధరించడంతో ఇషా అచ్చం వనదేవతలానే కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్