ఏఐ అందగత్తెలకీ పోటీలు!

మిస్‌ఇండియా, మిస్‌ వరల్డ్‌...అంటూ చాలా అందాల పోటీలనే చూసుంటారు. కానీ, కృత్రిమ మేధతో ప్రాణం పోసుకున్న అందగత్తెలందరి మధ్య పోటీలు జరగడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిసారి.

Published : 12 Jun 2024 01:59 IST

మిస్‌ఇండియా, మిస్‌ వరల్డ్‌...అంటూ చాలా అందాల పోటీలనే చూసుంటారు. కానీ, కృత్రిమ మేధతో ప్రాణం పోసుకున్న అందగత్తెలందరి మధ్య పోటీలు జరగడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిసారి. సాంకేతిక రంగంలో విప్లవాలు సృష్టిస్తోన్న కృత్రిమ మేధతో టీచర్లు, న్యూస్‌రీడర్లూ, ఇన్‌ఫ్లుయెన్సర్లు... ఇలా చాలామంది వృత్తి నిపుణులే పుట్టుకొచ్చారు. వీరంతా సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తూ, వాణిజ్య ప్రకటనలు, రీల్స్‌తో లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు. అందంలో, తెలివితేటల్లో మేటిగా ఉంటోన్న వీరిని చూస్తే నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మలేం. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్‌ ఏఐ క్రియేటర్‌ అవార్డ్స్‌’ పేరుతో సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత క్రియేటర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఫ్యాన్‌వ్యూ’ దీన్ని నిర్వహించింది.

ఈ పోటీల్లో ఏఐ మోడల్‌ అందంతో పాటు ఆమెను రూపొందించేందుకు వాడిన టెక్నాలజీ, సోషల్‌మీడియాలో ప్రభావం అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మొదటి పదిస్థానాల్లో నిలిచినవారి జాబితా విడుదల చేశారు. వీరిలో భారతదేశం నుంచి ‘జరా శతావరి’ పోటీపడింది. ఈ కాంపిటేషన్‌లో మొదటిస్థానంలో నిలిచిన ఏఐ అందగత్తెకు భారత కరెన్సీలో నాలుగు లక్షల రూపాయల ప్రైజ్‌మనీతో పాటు విలువైన మెంటారింగ్‌ యాక్సెస్, పీఆర్‌ సపోర్ట్‌ కూడా లభిస్తుంది. ఆ తరవాత రెండు స్థానాల్లో నిలిచిన వారికీ ప్రైజ్‌మనీ అందిస్తారు. అంతేకాదండోయ్‌! ఈ సుందరాంగుల పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ప్యానెల్లో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్లూ ఉండటం మరో విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్