వ్యాయామ పరికరాలను శుభ్రం చేస్తున్నారా?

గతంలో వ్యాయామమంటే ‘జిమ్‌’ గుర్తొచ్చేది. కరోనా తర్వాత సొంతంగా వ్యాయామ పరికరాలను సమకూర్చుకున్న వారెందరో! ఇంతకీ వాటిని శుభ్రం చేస్తున్నారా లేదా?

Published : 19 Oct 2022 00:15 IST

గతంలో వ్యాయామమంటే ‘జిమ్‌’ గుర్తొచ్చేది. కరోనా తర్వాత సొంతంగా వ్యాయామ పరికరాలను సమకూర్చుకున్న వారెందరో! ఇంతకీ వాటిని శుభ్రం చేస్తున్నారా లేదా?

* యోగా మ్యాట్‌.. యోగానే కాదు ఇతర వర్కవుట్‌లకీ మ్యాట్‌ తప్పనిసరే. శరీరాన్ని అంటుకునే దీన్ని రోజూ శుభ్రం చేయాలి. చెమట అంటుకునే అవకాశాలెక్కువ. దీంతో బ్యాక్టీరియా చేరుతుంది. ఇది తిరిగి చేతుల ద్వారా ముఖాన్ని చేరితే మొటిమలు, అలర్జీల సమస్య. కాబట్టి, కసరత్తులు అవ్వవగానే క్లెన్సర్‌ లేదా సబ్బు నీళ్లను దీనిపై చల్లి వస్త్రంతో తుడి …చేయండి. అంతేకాదు నెలకోసారి అయినా లోతైన శుభ్రత తప్పనిసరి. ఈ విషయంలో తయారీ సంస్థ సూచనల్ని పాటించాలి.

* ట్రెడ్‌మిల్‌.. దుమ్ము కనిపించినప్పుడల్లా దులిపేసి ఊరుకుంటున్నారా? దీన్నీ వ్యాయామం అవ్వగానే తడి వస్త్రంతో తుడవాలి. ఇక మోటార్‌ ప్రాంతాన్ని మాత్రం పొడి వస్త్రం లేదా వాక్యూమ్‌ క్లీనర్‌తో నెలకోసారి శుభ్రం చేస్తే సరి. క్లీన్‌ చేసే ముందు ప్లగ్‌ను తీయడం మర్చిపోవద్దు. బెల్ట్‌ కిందా శుభ్రం చేయాలి.

* డంబుల్స్‌.. తారలను అనుసరిస్తూ వీటినీ ఉపయోగిస్తున్న అమ్మాయిలెందరో! వీటిని మాత్రం రెండు వారాలకోసారి వేడి నీటిలో లిక్విడ్‌ డిష్‌ వాష్‌ కలిపి శుభ్రం చేయాలి. ఆపై పొడివస్త్రంతో తుడిచి ఆరబెట్టాలి. ఉపయోగించేముందు డిస్‌ఇన్ఫెక్టెంట్‌ స్ప్రే చేస్తే మంచిది. రోజూ కుదరకపోతే వారానికోసారైనా చేయాలి.

* వర్కవుట్‌ సైకిల్‌.. చెమట, నూనె ఎక్కువ దీనివల్లే విడుదలవుతాయి. అవి చేతుల ద్వారా హ్యాండిల్‌పైకి చేరతాయి. ఇంకేం సూక్ష్మక్రిములకు ఆవాసమవుతాయి. కాబట్టి, రోజూ తడి వస్త్రంతో తుడవడం తప్పనిసరి. లేదూ వేడినీళ్లలో లిక్విడ్‌ సోప్‌ కలిపిన మిశ్రమాన్ని స్ప్రే చేసినా సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్