దీపావళి.. బహుమతులా!

అందరికీ ఒకటే అన్న ధోరణి వద్దు. ఏది ఇవ్వాలనుకున్నా.. వయసు, మీతో ఉన్న అనుబంధం ఈ రెండు అంశాల్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు - అమ్మానాన్న, అత్తమామలకు అనుకోండి.. వారి అవసరాలు, ఆరోగ్యానికి సంబంధించినవి ఇవ్వొచ్చు. చిన్న పిల్లలైతే చాక్లెట్లు, కాస్త పెద్దవాళ్లైతే పుస్తకాలు లాంటివి ఇవ్వొచ్చు.

Published : 22 Oct 2022 01:10 IST

ఈ దీపాల పండగని వెలుగులతో నిర్వహించుకోవడమే కాదు.. బహుమతుల్ని ఇచ్చి పుచ్చుకోవడమూ చాలామందికి ఆనవాయితీ. సమస్యల్లా ఎంచుకోవడంతోనే.. మీదీ అదే సమస్యా? అయితే చదివేయండి.

అందరికీ ఒకటే అన్న ధోరణి వద్దు. ఏది ఇవ్వాలనుకున్నా.. వయసు, మీతో ఉన్న అనుబంధం ఈ రెండు అంశాల్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు - అమ్మానాన్న, అత్తమామలకు అనుకోండి.. వారి అవసరాలు, ఆరోగ్యానికి సంబంధించినవి ఇవ్వొచ్చు. చిన్న పిల్లలైతే చాక్లెట్లు, కాస్త పెద్దవాళ్లైతే పుస్తకాలు లాంటివి ఇవ్వొచ్చు. స్నేహితులు, సహోద్యోగుల్నీ ఒకే గాటన కట్టొద్దు. ఆఫీసు వాళ్లవి హుందాగా ఉండేలా చూసుకోండి. స్నేహితులకు వాళ్ల అభిరుచికి తగ్గవి ఎంచుకుంటే వారి పట్ల మీ ప్రేమని తెలిపిన వారవుతారు.

ఇక్కడ బడ్జెట్‌ని చూసుకోవడమూ ప్రధానమే. దీన్ని ముందే నిర్ణయించుకోండి. ఖరీదైనవే నాణ్యమైనవన్న అపోహ వద్దు. అవతలి వాళ్లకు ఉపయోగపడాలన్నదే మీ మంత్రమవ్వాలి. బోలెడు ఖర్చుపెట్టి ఓ వస్తువు కొన్నారు. చూడ్డానికి బాగున్నా షోకేసులోకి వెళ్లడమేగా! అదే ఉపయోగించుకునేలా ఇచ్చారనుకోండి.. వాడిన ప్రతిసారీ మీరు తప్పక గుర్తొస్తారు.

ఫ్యాషన్‌ను బాగా అనుసరించే వాళ్లనుకోండి. వాళ్లకి ఎంపిక చేయడం కాస్త సవాలే. అలాంటప్పుడు గిఫ్ట్‌కార్డ్‌లను ఇచ్చేయండి.    ఈ-కామర్స్‌ సంస్థలన్నీ వీటిని అందిస్తున్నాయి. బడ్జెట్‌ దాటదు.. వాళ్లకి నచ్చినవి ఇచ్చామన్న సంతృప్తి మీకూ ఉంటుంది.

గిఫ్ట్‌ అంటే బాగా కనిపించేలా ప్యాక్‌ చేయడం తప్పనిసరి అనుకుంటున్నారా? మనకసలే పండగ పని ఎక్కువ. ప్యాకింగ్‌ పనీ పెట్టుకుంటే అదో అదనపు బరువు. బహుమతి అందుకున్న వాళ్లు నచ్చిందా లేదా అనేదే చూస్తారు. ఎంత బాగా ప్యాక్‌ చేశారని కాదు. సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుంటే తప్ప.. సొంత ప్యాకింగ్‌ పని పెట్టుకోకండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్