సువాసనలు.. సహజంగా!

అతిథులొస్తున్నా.. దుర్వాసనలు దూరం చేయాలన్నా రూమ్‌ ‌ఫ్రెషనర్లను ఎంచుకుంటాం. సువాసన సరే.. వాటిలోని రసాయనాలు ఆరోగ్యానికి హాని అని తెలుసా? మరేం చేద్దాం.. ఇంట్లోనే తయారు చేసుకుంటే సరి!

Updated : 04 Nov 2022 05:09 IST

అతిథులొస్తున్నా.. దుర్వాసనలు దూరం చేయాలన్నా రూమ్‌ ‌ఫ్రెషనర్లను ఎంచుకుంటాం. సువాసన సరే.. వాటిలోని రసాయనాలు ఆరోగ్యానికి హాని అని తెలుసా? మరేం చేద్దాం.. ఇంట్లోనే తయారు చేసుకుంటే సరి!

* జెల్‌.. ఒక మందపాటి గిన్నెలో కప్పు నీటిని పోసి మధ్యస్థ మంట మీద వేడి చేయాలి. దాంట్లో చెంచా ఉప్పు వేసి కరిగాక ఏదైనా ఫ్లేవర్డ్‌ జెలటిన్‌ మూడు చెంచాలు కలిపి గిన్నెను దించేయాలి. అందులో నచ్చిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ 10-15 చుక్కలు కలిపి (కావాలనుకుంటే ఫుడ్‌ కలర్‌నీ జోడించవచ్చు) కొద్దిగా వేడి తగ్గే వరకూ పక్కనుంచాలి. గడ్డ కట్టకముందే ఈ మిశ్రమాన్ని ఓ గాజు సీసాలోకి తీసుకొని ఫాయిల్‌ కవర్‌ను చుట్టి చిన్న రంధ్రాలు చేస్తే సరి. సహజ రూమ్‌ ఫ్రెష్‌నర్‌ సిద్ధం. దీన్ని హాలు, పడకగది, బాత్‌రూమ్‌, కారు.. నచ్చిన చోట పెట్టుకోవచ్చు.

* స్ప్రే.. కప్పు నీటిని గోరువెచ్చగా అయ్యే వరకూ వేడి చేయాలి. దింపాక టేబుల్‌ స్పూను చొప్పున బేకింగ్‌ సోడా, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రేబాటిల్‌లోకి తీసుకొని రూమ్‌ స్ప్రేలా వాడుకోవచ్చు. వాడే ప్రతిసారీ బాగా షేక్‌ చేయాలి. దీంతో చిటికెలో ఇల్లు పరిమళాలను వెదజల్లుతుంది.

* డ్రై ఫ్రెష్‌నర్‌.. ఒక పెద్ద నారింజ, ఒక నిమ్మకాయ తీసుకొని మందమైన చక్రాల్లా కోసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒకదాని మీదకి మరొకటి రాకుండా ప్లేటు లేదా గిన్నెలో ఉంచి మైక్రోవేవ్‌ అవెన్‌లో 10 నిమిషాలు వేడిచేయాలి. వత్తినా రసం కారకుండా గట్టిగా అయితే చాలు. లేదంటే మరో రెండు నిమిషాలు పెట్టాలి. పూర్తిగా ఎండినట్లుగా అయ్యాక ఏదైనా గాజు గిన్నె లేదా పింగాణి ప్లేటులో ఉంచి, కావాల్సిన గదిలో ఉంచితే సరి... ఇల్లు సహజ సువాసనలతో నిండిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్