వంట... కొత్తా?

చదువులు, ఆపై ఉద్యోగాలంటూ తీరిక లేకుండా గడిపే అమ్మాయిలే ఎక్కువ. ఇష్టంగా, హాబీగా నేర్చుకుంటే సరే! లేదంటే వంట గది పరిచయమయ్యే అవకాశాలు తక్కువ. కొత్తగా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిందా? ఈ సూత్రాలు మరచిపోవద్దు.

Published : 24 Nov 2022 00:46 IST

చదువులు, ఆపై ఉద్యోగాలంటూ తీరిక లేకుండా గడిపే అమ్మాయిలే ఎక్కువ. ఇష్టంగా, హాబీగా నేర్చుకుంటే సరే! లేదంటే వంట గది పరిచయమయ్యే అవకాశాలు తక్కువ. కొత్తగా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిందా? ఈ సూత్రాలు మరచిపోవద్దు.

* ప్రారంభించడమే.. వంట చేసెయ్యాలన్న తొందరొద్దు. ముందు వంటగది తీరు, జాగ్రత్తలు తెలుసుకోండి. ఆపై పిండ్లు, దినుసులు, తాజా వాటిని ఎలా గుర్తించాలో గమనించాలి. ఏ అంశమైనా బేసిక్స్‌ అని నేర్చుకుంటాం కదా.. ఇవీ అలాంటివే! ఏ చాకులు దేనికి, ఏ గరిటలు ఎందుకు.. ఏ పాత్ర ఎంతమందికి సరిపోతుందన్న విషయాలతోపాటూ ఒకరికి వంట చేయాలంటే ఎంత సరకులు, కూరగాయలు కావాలి? దినుసులేం వాడాలన్నదీ అర్థం చేసుకోవాలి.

* పరీక్షలు, ఆఫీసులో పని.. ఈరోజు ఇంత చదివేయాలి, అంత పని పూర్తి చేయాలి అని టార్గెట్‌లు పెట్టుకుంటాం కదా! వంట విషయంలోనూ పెట్టుకోండి. ఇన్నిరోజుల్లో ఒక వంటకం నేర్చుకోవాలి అని వ్యవధి పెట్టుకున్నారనుకోండి. దాన్ని పూర్తిచేయాలన్న పట్టుదలా వస్తుంది. ఒకదాన్ని ఎవరి సాయం లేకుండా.. పుస్తకం, వీడియోలూ చూడకుండా చేయడం వచ్చాకే.. వేరే దానికి వెళ్లండి.

* కూరలన్నీ దాదాపుగా ఒకేలా చేసేయొచ్చు. తర్వాత ప్రత్యేక రుచులను ఎలా జోడించాలన్నది తెలుస్తుంది. ఇవన్నీ రెసిపీ చూసి చేసేస్తున్నాం కదాని.. పిండివంటలు, కేకులు లాంటివి ప్రయత్నించేస్తాం. మంచిదే! కానీ తేడా కొడితే మాత్రం నిరాశపడొద్దు.

* ఇష్టంగా నేర్చుకున్నది ఏదైనా త్వరగా ఒంటపడుతుంది. అవునా.. వంటా అంతే! ఫలానా వేళల్లోనే నేర్చుకోవాలి అన్న నియమం పెట్టుకోకండి. ఖాళీ ఉన్నంత మాత్రాన ఆసక్తి ఉండాలనేం లేదు. ప్రేమతో వండిన వంటకి ప్రత్యేక రుచి వస్తుందన్న మాట విన్నారా? కాబట్టి, ముందు నేర్చుకోవాలన్న ఆసక్తి తెచ్చుకోండి. ఇష్టమైన వారికోసం ప్రయత్నిస్తున్నారనుకోండి.. ఆ ఇష్టం దానిపైకీ మళ్లుతుంది. అలా చేసిన వంటలను లొట్టలేసుకుంటూ తింటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్