చిన్న బాల్కనీలో చిరుతోట!

మొక్కలంటే చాలా ఇష్టం. కానీ స్థలాభావంతో పెంచడానికి వీలుకావడం లేదని నిరుత్సాహ పడక్కర్లేదు.

Updated : 25 Nov 2022 04:17 IST

మొక్కలంటే చాలా ఇష్టం. కానీ స్థలాభావంతో పెంచడానికి వీలుకావడం లేదని నిరుత్సాహ పడక్కర్లేదు. చిన్న బాల్కనీ ఉన్నా చాలు.. నచ్చినట్లుగా కొన్ని మొక్కలనైనా పెంచుకోవచ్చు...

బయటికి స్టాండ్స్‌.. బాల్కనీలో చిన్న చిన్న గులాబీ, నైట్‌క్వీన్‌ వంటి పూల మొక్కలున్న తొట్టెలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉన్నదే కూసింత మళ్లీ అందులో ఇవన్నీ ఎక్కడ పెడతాం అంటారా? అందుకే బాల్కనీ బయటి వైపు ఏర్పాటు చేసుకొనేలా ఇప్పుడు రకరకాల స్టాండ్స్‌/ ట్రేస్‌ లభ్యమవుతున్నాయి. బాల్కనీ పొడవు బట్టి నాణ్యమైన స్టాండ్‌ను ఎంపిక చేసుకొని గ్రిల్‌కి లేదా పారపెట్‌ వాల్‌కి బిగిస్తే చాలు. ఆ తర్వాత వీటిలో వరుసగా కుండీలను సర్దుకోవాలి. బాల్కనీ మొక్కల్లో కాక్టస్‌ బాగా పెరుగుతుంది. ఎండలో పెరుగుతూ పూలు పూసే మొక్కలనూ ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో రెండుమూడు రంగుల బోగన్‌విలియాను పెంచినా చూడటానికి బాగుంటుంది. కొమ్మలను ఎప్పటికప్పుడు ట్రిమ్‌ చేస్తుంటే చక్కగా గుబురుగా పెరిగి, బాల్కనీ అంతా రంగురంగుల పూలు విరబూసి, చూడముచ్చటగా ఉంటాయి. తీగజాతి మొక్కలను మధ్యనున్న కుండీల్లో ఉంచాలి. ఇవి పెరిగాక కిందకు వేలాడుతూ బాల్కనీ అంతా పచ్చదనంతో నిండినట్లు అనిపిస్తుంది. పుదీనా, కొత్తిమీరవంటివి కూడా పెంచితే వంటలో తాజాగా వినియోగించొచ్చు.

పై నుంచి.. బాల్కనీలో సీలింగ్‌కి ఫెర్న్‌, మనీప్లాంట్‌ తొట్టెలను వేలాడదీస్తే పైభాగం కూడా పచ్చగా మారుతుంది. బాల్కనీ గుమ్మానికి అటూ ఇటూ తీగజాతి మొక్కలను అల్లిస్తే పచ్చతోరణమే! దీంతోపాటు బాల్కనీలో రెండు కుర్చీలు, చిన్న బల్ల సర్దితే చాలు. ఉదయం, సాయంత్రం టీ తాగుతూ తోటలో కూర్చున్న అనుభూతిని పొందొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్