కంపోస్ట్‌.. ఇంట్లోనే!

మొక్కల పెంపకం మీ వ్యాపకమా? వాటికి ఎరువులు, కంపోస్ట్‌ అంటూ బయటి నుంచి కొనుక్కొస్తున్నారా? కూరగాయల పొట్టు, మిగిలిపోయిన ఆహారపదార్థాలు.. ఇలా మన వంటగది నుంచి రోజూ బయటకు వచ్చే వృథా ఎంతో! కాస్త సమయం వెచ్చిస్తే ఇంట్లోనే కంపోస్టు సిద్ధం చేసుకోవచ్చు.

Published : 09 Dec 2022 00:53 IST

మొక్కల పెంపకం మీ వ్యాపకమా? వాటికి ఎరువులు, కంపోస్ట్‌ అంటూ బయటి నుంచి కొనుక్కొస్తున్నారా? కూరగాయల పొట్టు, మిగిలిపోయిన ఆహారపదార్థాలు.. ఇలా మన వంటగది నుంచి రోజూ బయటకు వచ్చే వృథా ఎంతో! కాస్త సమయం వెచ్చిస్తే ఇంట్లోనే కంపోస్టు సిద్ధం చేసుకోవచ్చు.

కింద రంధ్రమున్న ఒక పెద్ద కుండీని తీసుకోండి. దాన్ని ఎండిన ఆకులతో నింపేయాలి. ఆపై కొంచెం మట్టి చేర్చండి. ఇప్పుడు పండ్లు, కూరగాయల పొట్టు, మిగిలిన ఆహారం, వాడిన టీపొడి, గుడ్డు పెంకులు, వాడిన పూలు.. వంటివన్నీ వేసి, మట్టితో కప్పేయాలి. ఆపై కొద్దిగా నీటిని చిలకరించి వదిలేయాలి. నీరు మరీ కారేలా పోయొద్దు. మాంసం, డెయిరీ ఉత్పత్తులనూ చేర్చొద్దు. ఆపై మూత పెట్టేసి వదిలేయండి.

దానిపై ఎండిన మొక్కల కాండాలు, కాగితం ముక్కలు, కోకోపీట్‌ వంటివి వేస్తే తేమ బయటకి పోకుండా ఉంటుంది. రోజువారీ వృథా, ఆపై మట్టి, కాగితాలు, కోకోపీట్‌, నీళ్లు.. పొరలుగా వేసుకుంటూ వెళ్లాలి. కొద్ది వెలితిగా ఉండేవరకూ ఇలా చేస్తూ ఉండాలి. దాన్ని ఓ మూడు రోజులు వదిలేయాలి. తర్వాత రెండురోజులకోసారి కలుపుతూ ఉండాలి. కుండీలో మొత్తం మిశ్రమం ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకూ ఇలా చేయాలి. ఆపై మొక్కలకు వేస్తే సరి.

దీనిద్వారా మొక్కలకు అత్యవసరమైన పొటాషియం, నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌ అందుతాయి. కంపోస్ట్‌ నేలను సారవంతంగా చేసి, మొక్కలు ఆరోగ్యంగా, ఏపుగా పెరిగేలా చేస్తుంది. రసాయనాల బాధ ఉండదు కాబట్టి, మనకీ ఆరోగ్యం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్