పాత సీడీలపై పెయింటింగ్‌ చేద్దామా..

పనికిరాని వస్తువులని చాలా వాటిని పడేస్తూంటాం. అలా తొందరపడి పడేయకండి. కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. వాటితో కూడా అందంగా ఏదో ఒకటి తయారు చేయొచ్చు.

Published : 22 Jan 2023 00:22 IST

పనికిరాని వస్తువులని చాలా వాటిని పడేస్తూంటాం. అలా తొందరపడి పడేయకండి. కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. వాటితో కూడా అందంగా ఏదో ఒకటి తయారు చేయొచ్చు. ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా మనలో ఉన్న సృజనాత్మకతను వెలికితీద్దాం. రండి పాత సీడీలకి రంగు లేద్దాం.

రాత్రికి రంగుల ద్దినట్లుగా... ఈ సీడీని చూడండి అచ్చం రాత్రికి రంగులద్దినట్లుగా లేదు. పెయింటింగ్‌ వెయ్యడం కూడా చాలా తేలిక. ముందుగా సీడికి అడుగు భాగంలో కొండలు, మొక్కలు తలపించే విధంగా కుంచె తీసుకొని నలుపు రంగుని వేయండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రంగు వేసినా దాన్ని కాసేపు ఆరబెట్టాకే మిగిలిన భాగంలో రంగులు వేయాలి. దానికి పైన ఒక అంగుళం వరకూ తేలిక పాటి నీలం రంగు వేస్తే ఆకాశాన్ని తలపిస్తుంది. ఇక పై భాగం మొత్తం నలుపు రంగు అద్ది అక్కడక్కడా తెలుపు రంగుతో చిన్న చిన్న చుక్కలు పెడితే అచ్చం నక్షత్రాల్లా ఉంటాయి. వీటిని బెడ్‌రూంలో తగిలిస్తే సరి.

పూల గుత్తులు భళా... ముందుగా సీడీ మొత్తానికి తేలికపాటి రంగుని అద్ది ఆరనివ్వాలి. తరువాత కుంచెతో ఆకుపచ్చ, నలుపు రంగులతో సన్నగా కాడలను గీసుకోవాలి. కొంచెం ఆరనిచ్చి పువ్వుల గుత్తుల కోసం నిండు రంగులు ఎంచుకోవాలి. నేరుగా పువ్వుల ఆకృతి కష్టం అనిపిస్తే ముందుగా పెన్సిల్‌తో గీయండి. ఆ తర్వాత పెయింటింగ్‌తో పూవులు వేస్తే అయిపోయినట్టే. చూడండి ఎంత అందంగా ఉందో.. వీటిని లివింగ్‌ రూంలో ఉంచితే ఆ లుక్కే వేరబ్బా!

సూర్యుడు, చంద్రుడు కూడా.. సీడీపై ముందుగా పెన్సిల్‌తో ఫొటోలో కనిపిస్తున్నట్టు ఏటవాలుగా గీతలు గీయాలి. వాటి అంచులకు బంగారు రంగు వేయాలి. ఆరిన తర్వాత వాటి మధ్యలో ముదురు రంగులు ఎంచుకొని అద్దాలి. ఆపై సూర్యుడు, చంద్రుడు, ప్లానెట్‌లు గీసి వాటికి కూడా రంగులు అద్దితే సరి. వీటిని పిల్లల గదిలో అలంకరిస్తే చాలా బాగుంటుంది. మీక్కూడా నచ్చాయి కదూ.. ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేయండి మరి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్