గది అందాన్ని పెంచే గోడ చిత్రాలు

కళలపై ఆసక్తి ఉండేవారు...ఇంటి అలంకరణలో వాటిని చేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. వాటిలో చిత్ర కళ తీరే వేరు. దీంతో గోడల అందాన్ని రెట్టింపు చేయొచ్చనీ, అయితే, వీటి ఎంపికలో మాత్రం మన అభిరుచి కనిపించాలని సూచిస్తున్నారు నిపుణులు.

Published : 25 Jan 2023 00:20 IST

కళలపై ఆసక్తి ఉండేవారు...ఇంటి అలంకరణలో వాటిని చేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. వాటిలో చిత్ర కళ తీరే వేరు. దీంతో గోడల అందాన్ని రెట్టింపు చేయొచ్చనీ, అయితే, వీటి ఎంపికలో మాత్రం మన అభిరుచి కనిపించాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే కనిపించే ముందుగది, హాల్‌లోని గోడను ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దాలంటే రవివర్మ వంటి కళాకారుల కుంచె నుండి జాలువారిన మహారాణి కళాఖండం ఎంపిక మంచిది. అలాగే సృజనాత్మకత ఉట్టిపడే గిరిజన, జానపద లేదా గ్రామీణ సంస్కృతి ప్రతిఫలించే చిత్రాలను కూడా ముందుగది గోడకు అలంకరణగా అమర్చొచ్చు.

సాధనకు.. మనసుకు నచ్చిన సంగీతం వినేవారికి ముందుగదిలో వాలుకుర్చీ లేదా ఊయల ఏర్పాటు ఉంటే  గది గోడకు వర్లీ లేదా తంజావూరు చిత్రలేఖనం సరైన ఎంపిక. అలాగే పడకగది గోడపై ఫ్రేంలో గులాబీలు విరబూసిన తోట లేదా కడలితీరం వంటివి మనసుకు ప్రశాంతత అందిస్తాయి.  

సహజంగా.. ఆఫీస్‌ వర్క్‌ లేదా పిల్లల స్డడీ రూం గోడలకు ప్రకృతిని అద్దేలా గోడంతా పెయింటింగ్‌ వేయించుకోవచ్చు. అక్వేరియం, లోయలోని పచ్చదనం, కొండల అంచుల్లో పూల సోయగం వంటివి మంచి ఎంపిక. హాల్‌ నుంచి పడకగదిలోకి వెళ్లే మార్గం లేదా ఇంటి మధ్యలో మెట్ల పక్కగా ఉండే పొడవైన గోడకు చిన్నచిన్న చిత్రలేఖనాలు వరుసగా వేయించిన ఫ్రేంను అమర్చితే చాలు. అమ్మవారి ముఖారవిందం లేదా నవరసాల పల్లెపడతి భంగిమలు వంటివి ఈ ఫ్రేంలో ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్