టూర్‌ ప్లాన్‌ చేసేయండి..

మొన్నేగా పండక్కి వెళ్లొచ్చామంటారా? ఇంట్లో వాళ్లంతా ఆనందించారు సరే! మరి మన సంగతో? ఇల్లు శుభ్రం చేయటం, పిండి వంటలు, అతిథుల హడావుడితో బాగా అలసిపోయాం.

Published : 29 Jan 2023 00:03 IST

మొన్నేగా పండక్కి వెళ్లొచ్చామంటారా? ఇంట్లో వాళ్లంతా ఆనందించారు సరే! మరి మన సంగతో? ఇల్లు శుభ్రం చేయటం, పిండి వంటలు, అతిథుల హడావుడితో బాగా అలసిపోయాం. తిరిగి రోజువారీ పనులు రానే వచ్చాయి. పైగా పిల్లల పరీక్షలూ దగ్గర పడుతున్నాయి. వీటన్నింటి నుంచీ వాళ్లనీ, మనల్నీ సిద్ధం చేయాలంటే ఒక టూర్‌ తప్పనిసరే!

* ఆహ్లాదభరితంగా సాగే ప్రాంతాన్ని ఎంచుకుంటే ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ ఆస్వాదించగలుగుతారు. దూరప్రాంతాలకు ప్రయాణం చేయటం కూడా సరదాగా అనిపిస్తుంది. ట్రావెలింగ్‌లో ఎన్నో కొత్త అనుభవాలను పోగుచేసుకోవచ్చు.

* కొండలు, నదులు, ప్రకృతి ఒడిలో గడిపేలా చూసుకుంటే మీతోపాటు పిల్లల్లో గూడుకట్టుకున్న ఒత్తిడి దూరమవుతుంది. పిల్లల వయసును బట్టి, ఆటలు, మెదడుకు మేత పెట్టేలా, ఆనందాన్ని నింపేలా కొత్తగా ప్రయత్నించే అవకాశమున్నవి చూసుకుంటే వాళ్లూ ఆస్వాదించగలుగుతారు.

* అక్కడికెళ్లినా మీమీదే భారం పడేలా ఉంటే వెళ్లకపోవడమే మేలు. కాబట్టి, పెద్దవాళ్లని చూసుకోవడం, వంట మీరే చేయడం లాంటి పనులుండొద్దు. మరీ పెద్దవాళ్లయితే వాళ్లు సేదతీరేలా ఉండే ప్రాంతాలను ఎంచుకోవాలి. ఖర్చు భయముంటే బడ్జెట్‌లోనే పూర్తిచేయగల ప్రదేశాలను ఎంచుకుంటే సరి.

* ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ముందే ఖర్చులు ఎలా ఉంటాయో, అసలు మీ బడ్జెట్‌ ఎంత, ఏయే ప్రదేశాలు చూడాలనుకుంటున్నారో ముందే ప్రణాళిక వేసుకుంటే తర్వాత తేలికగా ఉంటుంది. కొద్ది బరువుతో, స్మార్ట్‌గా ప్లాన్‌ చేసుకుంటే తక్కువ ఖర్చుతో.. బోలెడు ఉల్లాసాన్ని మూటగట్టుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్