స్నానాల గది శుభ్రంగా..

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఒకెత్తయితే స్నానాలగదిని కడగడం మరో ఎత్తు. అయితే, ఆ పనిని భారంగా భావించకుండా సులువుగా పూర్తి చేసేందుకు కొన్ని చిట్కాలున్నాయి.

Updated : 16 Oct 2023 04:10 IST

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఒకెత్తయితే స్నానాలగదిని కడగడం మరో ఎత్తు. అయితే, ఆ పనిని భారంగా భావించకుండా సులువుగా పూర్తి చేసేందుకు కొన్ని చిట్కాలున్నాయి..

  • స్నానాల గదిలో చేరిన మురికీ, సబ్బు, షాంపూ తాలూకు వ్యర్థాలు టైల్స్‌, గోడల్ని అంటుకున్న మరకల్ని త్వరగా వదిలించాలి. లేదంటే మరింత బలంగా మారతాయి. క్రమంగా టైల్స్‌ పసుపు రంగులోకి  మారతాయి. రోజూ అందరి స్నానాలూ పూర్తయ్యాక వెనిగర్‌ కలిపిన గోరువెచ్చని నీళ్లతో ఓ సారి రుద్ది కడిగేయండి. పాకుడు పట్టదు.
  • వారానికోసారైనా బాత్రూమ్‌ని శుభ్రం చేయడానికి ముందు బ్లీచింగ్‌ చల్లాలి. లోపల ఉండే తేమ వాతావరణానికి సూక్ష్మక్రిములు అక్కడ నివాసం ఏర్పరుచుకుంటాయి. వీటిని బ్లీచింగ్‌ తొలగిస్తుంది.  
  • స్నానాలగదిలో వాడిన రాతి పలకల్ని బట్టి వాటిని శుభ్రం చేసే క్లీనర్లను ఎంచుకోవడం మంచిది. అయితే, వీటిల్లో కఠిన రసాయనాలు లేకుండా చూసుకోవాలి. తెలుపు రాతి పలకల్ని శుభ్రపరచడానికి క్లోరిన్‌ బ్లీచ్‌, రంగు రాతి పలకలకు క్లోరిన్‌ లేని బ్లీచ్‌ ఉపయోగించాలి. లేదంటే అవి పాడైపోయే ప్రమాదం ఉంది.
  • టైల్స్‌ రంగు మారినా, మరకలు వదలకపోయినా వెనిగర్‌, వంట సోడా, లిక్విడ్‌ సోప్‌ కలిపిన మిశ్రమాన్ని చల్లి కాసేపు వదిలేయండి. ఆపై బ్రష్‌తో రుద్దేస్తే సరి. గోడలకు కాస్త చిక్కగా తయారు చేసుకున్న ఈ పేస్ట్‌ని రాసి మురికిని వదిలించేయొచ్చు. ఇలా చేస్తే సూక్ష్మక్రిములనూ వెళ్లగొట్టొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్