పసుపు మరకలా..

కార్తికమాసం వస్తే పూజలు, ఉపవాసాలు మొదలవుతాయి. గుళ్లకు వెళ్లడమూ ఉంటుంది. తెలియకుండానే దుస్తులపై పసుపు మరకలొచ్చేస్తాయి. మరి వాటిని వదిలించడానికి ఏ చిట్కాలున్నాయో తెలుసుకుందాం..

Published : 24 Nov 2023 01:24 IST

కార్తికమాసం వస్తే పూజలు, ఉపవాసాలు మొదలవుతాయి. గుళ్లకు వెళ్లడమూ ఉంటుంది. తెలియకుండానే దుస్తులపై పసుపు మరకలొచ్చేస్తాయి. మరి వాటిని వదిలించడానికి ఏ చిట్కాలున్నాయో తెలుసుకుందాం..

  • పసుపు మరకలు పోగొట్టడానికి సబ్బుతో రుద్దేయొద్దు. బదులుగా ఒక చెంచా మొక్కజొన్న పిండి వేసి రుద్దండి. ఒక అరగంట ఉంచి.. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. తర్వాత సబ్బు లేదా డిటర్జెంట్‌తో ఉతకొచ్చు.
  • మరకని నిమ్మచెక్కతో రెండు నిమిషాలు రుద్ది, తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
  • గ్లిజరిన్‌ కూడా మంచి పరిష్కారమే. చిన్న బకెట్‌లో పావుకప్పు గ్లిజరిన్‌, పావుకప్పు లిక్విడ్‌ సోప్‌, కప్పు నీరు పోసి కలపాలి. మరకలు పడ్డ వస్త్రాలని 20 నిమిషాలుంచి రుద్దితే మరకలు పోతాయి.
  • జెల్‌ కాకుండా సాధారణ టూత్‌ పేస్ట్‌ను తీసుకుని మరకపై రాయాలి. తర్వాత బ్రష్‌తో మృదువుగా రుద్ది.. అరగంటయ్యాక డిటర్జెంట్‌తో శుభ్రం చేయాలి. తర్వాత ఎండలో ఆరేస్తే మరక పోతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్