ఒత్తిడి మాయం చేసే తోట!

ఒకప్పట్లా విశాలమైన స్థలాలు లేకపోయినా, ఉన్న స్థలంలోనే మొక్కలను పెంచేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇదో మంచి మార్గంగా భావిస్తారు.

Published : 26 Nov 2023 02:11 IST

ఒకప్పట్లా విశాలమైన స్థలాలు లేకపోయినా, ఉన్న స్థలంలోనే మొక్కలను పెంచేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇదో మంచి మార్గంగా భావిస్తారు. ఈ క్రమంలో మీకు ఉపయోగపడే చిట్కాలివి..

  • చిక్కుడు, కాకర, బీర వంటి వాటికి పందిరి వేస్తుంటాం. ఇలా చేయడం వల్ల మిగిలిన మొక్కలకి ఎండ తగలదు. వాడిపోయినట్లు అవుతాయి. అలా కాకుండా పాదులకు ప్రత్యేకించి గ్రిల్స్‌, స్టాండ్స్‌ వంటివి దొరుకుతున్నాయి. వాటిని ఏర్పాటు చేసుకుంటే.. స్థలమూ కలిసి వస్తుంది. మొక్కలు విశాలంగా పెరుగుతాయి. పచ్చని ఆ తోటలో సాయంత్రం కుర్చీలు వేసుకుని, కాఫీ తాగే సమయానికి విడిదిగానూ ఉంటుంది.
  • మేడమీద లేదా గార్డెన్‌లో పూలకుండీలు పెద్దవిగా ఉంటే వాటిని ఒకచోట నుంచి మరొక చోటకి కదల్చడం కష్టం అవుతుంది. అందువల్ల కుండీల కింద ట్రాలీలు ఏర్పాటు చేసుకుంటే జరపడం కాస్త తేలికవుతుంది.
  • వీటితో పాటు మొక్కల మధ్యలో పక్షులు పెంచేందుకు వీలుగా పంజరాలు పెట్డండి. ఇందుకు ఒక అట్టపెట్టెను నెస్ట్‌లా మార్చి ఒక చెట్టుకి వేలాడదీస్తే చాలు. చూడటానికీ, మనసుకీ హాయిగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్