బియ్యం కడుగుతో.. పాత్రల జిడ్డు మాయం

వంటలు రుచిగా ఉండాలని ఉప్పూ, కారాలు, నూనెలు కాస్త ఎక్కువగానే దట్టిస్తాం. అందుకే వేపుళ్లు, డీప్‌ఫ్రైలు చేసినప్పుడు గిన్నెలు, కడాయిలు జిడ్డు పట్టేస్తుంటాయి. అలాగే చాలా రోజులు పాత్రలు వాడకపోయినా ఇలా జరుగుతుంది.

Updated : 01 Dec 2023 05:08 IST

వంటలు రుచిగా ఉండాలని ఉప్పూ, కారాలు, నూనెలు కాస్త ఎక్కువగానే దట్టిస్తాం. అందుకే వేపుళ్లు, డీప్‌ఫ్రైలు చేసినప్పుడు గిన్నెలు, కడాయిలు జిడ్డు పట్టేస్తుంటాయి. అలాగే చాలా రోజులు పాత్రలు వాడకపోయినా ఇలా జరుగుతుంది. ఈ చిట్కాలతో జిడ్డుని దూరం చేయొచ్చు..

  • వెనిగర్‌: వంటపాత్రల జిడ్డును తొలగించడంలో వెనిగర్‌ సహజక్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. వెనిగర్‌నీ, నీటినీ సమాన పరిమాణాల్లో తీసుకుని ఒక స్ప్రేబాటిల్‌లో వేసి జిడ్డుపాత్రలపై స్ప్రే చేయాలి. కాసేపాగి స్క్రబ్బర్‌తో రుద్దితే.. జిడ్డు మాయం.
  • నిమ్మరసం: జిడ్డు ఎక్కువ ఉన్న పాత్రలపై నిమ్మరసం లేదా నిమ్మ చెక్కల పేస్టుని రాయాలి. పది నిమిషాలాగి మెత్తని పీచు, బ్రష్‌తో రుద్ది కడిగితే చక్కగా శుభ్రం అవుతాయి. నిమ్మలోని ఆమ్ల గుణాలు జిడ్డుని తొలగించడంలో సాయపడతాయి.
  • వేడినీళ్లు: ఒక పెద్ద తొట్టెలో వేడినీటిని తీసుకుని దానిలో కొద్దిగా సోప్‌ లిక్విడ్‌ వేయాలి. దానిలో జిడ్డు పేరుకుపోయిన పాత్రలను వేసి ఇరవై నిమిషాలు ఉంచేయండి. వేడినీళ్లు జిడ్డుని వదిలిస్తాయి.
  • బేకింగ్‌ సోడా: జిడ్డు పాత్రలపై వంటసోడా చల్లి.. కాసేపయ్యాక బ్రష్‌ లేదా స్పాంజ్‌తో రుద్ది కడిగితే పాత్రలు తళతళా మెరుస్తాయి.
  • బియ్యం కడుగు: ఒక టబ్‌లో బియ్యం కడిగిన నీళ్లు పోసి.. దానిలో రెండు స్పూన్ల బేకింగ్‌సోడా, చెక్క నిమ్మరసం పిండాలి. దానిలో మురికిగా ఉన్న పాత్రలను పదినిమిషాలు ఉంచాలి. తర్వాత వేడినీటితో శుభ్రం చేసుకోవాలి. చన్నీళ్లు వాడితే జిడ్డు ఇంకా బలపడుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్