వంటింట్లో కీటకాల బెడదా..

వంటగదిలో కాస్త తడిగా ఉన్నా, చెత్త ఏ మాత్రం మర్చిపోయినా చిన్న చిన్న కీటకాలు, పురుగులు చేరుతుంటాయి. మరి వీటిని దూరం చేయాలంటే... ​​​​​​​స్ప్రే బాటిల్‌లో కాస్త వెనిగర్‌ను తీసుకుని అందులో అరస్పూన్‌ డిష్‌వాష్‌ లిక్విడ్‌ వేసి కొంత నీటిని నింపాలి. ఈ ద్రావణాన్ని కీటకాలు, పురుగులు ఉన్న చోట పిచికారీ చేస్తేసరి.

Published : 22 Apr 2024 01:47 IST

వంటగదిలో కాస్త తడిగా ఉన్నా, చెత్త ఏ మాత్రం మర్చిపోయినా చిన్న చిన్న కీటకాలు, పురుగులు చేరుతుంటాయి. మరి వీటిని దూరం చేయాలంటే...

స్ప్రే బాటిల్‌లో కాస్త వెనిగర్‌ను తీసుకుని అందులో అరస్పూన్‌ డిష్‌వాష్‌ లిక్విడ్‌ వేసి కొంత నీటిని నింపాలి. ఈ ద్రావణాన్ని కీటకాలు, పురుగులు ఉన్న చోట పిచికారీ చేస్తేసరి.

  • వంటగదిలో ఈ కీటకాలు ఎక్కువగా చేరే ప్రదేశంలో అంటే చెత్త బుట్ట, సింకు, స్టవ్‌, వంటగట్టు వంటిచోట్ల కొన్ని కర్పూరం బిళ్లలను ఉంచండి. వీటి వాసనకు కీటకాలు దూరమవుతాయి.
  • బేకింగ్‌ సోడాను ఒక స్ప్రే బాటిల్‌లో వేసి కాస్త నీటిని చేర్చి కీటకాలు ఉన్న చోట స్ప్రే చేస్తే చాలు.
  • గ్లాసు నీటిలో కొన్ని చుక్కల వేపనూనె కలిపి వంటగదిలో కీటకాలు, పురుగులు ఉన్న ప్రదేశంలో, మూలల్లో స్ప్రే చేయండి. వేప క్రిమినాశిని కాబట్టి కీటకాల బెడదను తగ్గిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్