తేనె ధారలా..!

వంటింట్లో కొన్ని పనులు అచ్చంగా మనమే చేయాల్సి ఉంటుంది. పిల్లలకు చెప్పాలంటే భయం. కానీ యుక్తవయసు పిల్లలు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా, వాళ్లంతట వాళ్లు కొన్ని పనులు చేసుకోవచ్చు. లేదా మనకైనా సాయం చేయొచ్చు.

Published : 05 Jun 2024 03:01 IST

స్మార్ట్‌ కిచెన్‌

వంటింట్లో కొన్ని పనులు అచ్చంగా మనమే చేయాల్సి ఉంటుంది. పిల్లలకు చెప్పాలంటే భయం. కానీ యుక్తవయసు పిల్లలు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా, వాళ్లంతట వాళ్లు కొన్ని పనులు చేసుకోవచ్చు. లేదా మనకైనా సాయం చేయొచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని పరికరాలు ఇవి...


క్షణాల్లో పేస్టు చేయొచ్చు..

కూరలు, వేపుళ్లు.. ఇలా ఏవైనా సరే కమ్మని సువాసన, రుచి రావాలంటే ముందుగానే తయారుచేసుకున్న మసాలాల కంటే అప్పటికప్పుడు చేసుకుంటేనే బావుంటుంది. అందుకోసం మనం మళ్లీ ప్రత్యేకించి వాటిని మిక్సీలో వేసి రుబ్బాలంటే శ్రమే. పైగా వాటికి ప్లేటు, స్పూన్లు వంటివి అవసరం అవుతాయి. వాటిని శుభ్రపరచుకోవడం మరోపని. అందుకే ఈ ‘రోటరీ హెర్బల్‌ చాపర్‌’ను తెచ్చుకోండి. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, గ్రీన్‌ ఆనియన్స్, కూరగాయల ముక్కలు, మసాలా దినుసులు... ఇలా ఏవైనా కచ్చాపచ్చాగా చేసుకోవచ్చు. లోపల అమర్చి ఉన్న స్టీల్‌ రోటరీ బ్లేడులు వేగంగా మసాలాలను, కూరగాయల ముక్కలను క్షణాల్లో చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేస్తుంది. పని అయ్యాక దీన్ని క్లీన్‌ చేసుకోవడం కూడా తేలిక.


ఒక చాకు... మూడు పనులు!

బ్రెడ్‌ బటర్‌...పిల్లలు కూడా తేలిగ్గా సిద్ధం చేసుకోగల ఆహారం. అయితే, దాన్ని మరింత సులభం చేసేందుకు ‘త్రీ ఇన్‌ వన్‌ నైఫ్‌’లు అందుబాటులోకి వచ్చాయి. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారైన ఇది బ్రెడ్‌ కటర్‌గా, కర్లర్‌గా, స్ప్రెడర్‌గానూ ఉపయోగపడుతుంది. దీనికి ఉండే చిన్న చిన్న రంధ్రాలు గడ్డకట్టిన బటర్‌ను కర్ల్‌ రూపంలో వచ్చేలా చేస్తాయి. దీని డిజైన్, స్మూత్‌ ఫినిష్‌ వల్ల పిల్లలు కూడా సురక్షితంగా ఉపయోగించొచ్చు. దీని సాయంతో జామ్, చాక్లెట్‌ క్రీమ్‌ లాంటి వాటిని కూడా టోస్ట్‌ మీద పరచుకోవచ్చు. పైగా ఇది బ్రెడ్, బటర్, పండ్లు, కూరగాయలు, కేక్‌... లాంటివి కట్‌ చేసుకునే ఆల్‌ ఇన్‌ వన్‌ కిచెన్‌ నైఫ్‌లానూ పనికొస్తుంది.


తేనెకీ ఓ పరికరం...

ఉదయాన్నే వేడినీళ్లలోనో, టీలోనో తేనె కలుపుకొంటాం కదా! ప్రతిసారీ డబ్బాలోని తేనెను స్పూనుతో తీసుకోవడం విసుగే. బదులుగా ఈ ‘హనీ డిస్పెన్సర్‌’ను తెచ్చుకుంటే సరి. చేతికి తేనె అంటకుండా స్పూనులాంటివీ అవసరం లేకుండా వేసుకోవచ్చు. ఇందులో మూత, కంటైనర్, స్టాండ్‌...మూడు భాగాలు ఉంటాయి. కంటైనర్‌లో తేనెను నింపుకొని మూత పెట్టేసుకుంటే చాలు. కావాల్సినప్పుడు దానికి ఉన్న హ్యాండిల్‌ను నొక్కితే సన్నని ధారలా తేనె బయటకు వస్తుంది. ఆ తర్వాత దాన్ని స్టాండ్‌లో పెట్టేసుకోవచ్చు. ఆక్రిలిక్‌ మెటీరియల్‌తో తయారుచేసిన దీన్ని డైనింగ్‌ టేబుల్‌ మీద ఉంచితే చూడడానికి అందంగానూ, షోపీస్‌లానూ ఉంటుంది. దీన్లో తేనె ఒక్కటే కాదు... అలాంటి లిక్విడ్‌లు ఏవైనా పోసుకుని వాడుకోవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్