గౌన్లు, పిల్లులూ అన్నీ చేతిరుమాళ్లే..!

ఇంట్లోని వస్తువు కేవలం అవసరాన్ని తీర్చేదిలా మాత్రమే కాదు... అది అందంగా, చూడ చక్కని రూపంలోనూ ఉండాలనుకుంటోంది నేటితరం. ఇది పెద్ద వస్తువులకే పరిమితమవట్లేదు... చిన్న చిన్న వస్తువులూ ఆకర్షణీయంగా, తమ అభిరుచిని తెలిపేవిగా ఉండాలనుకుంటున్నారు.

Published : 10 Jun 2024 02:19 IST

స్మార్ట్‌ హోమ్‌

ఇంట్లోని వస్తువు కేవలం అవసరాన్ని తీర్చేదిలా మాత్రమే కాదు... అది అందంగా, చూడ చక్కని రూపంలోనూ ఉండాలనుకుంటోంది నేటితరం. ఇది పెద్ద వస్తువులకే పరిమితమవట్లేదు... చిన్న చిన్న వస్తువులూ ఆకర్షణీయంగా, తమ అభిరుచిని తెలిపేవిగా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేతి రుమాళ్లూ చేరాయి.

ఒకప్పుడు హ్యాండ్‌ న్యాప్‌కిన్లంటే చేతులు తుడుచుకునే ఒక వస్త్రం అంతే. కానీ ఇప్పుడివి రంగురంగుల గౌన్లు, చాక్లెట్లూ, కుక్క, పిల్లి... వంటి రూపాల్లో వచ్చేస్తున్నాయి. కాటన్, మైక్రోఫైబర్, టెర్రీక్లాత్, లినెన్, టర్కిష్‌... వంటి భిన్న వస్త్ర రకాల్లోనూ దొరుకుతున్నాయి. వీటిని వంటగది, భోజనాల గది, బాత్‌రూమ్‌.... ఎక్కడ తగిలించినా సరే ఒదిగిపోతున్నాయి. ముట్టుకుంటేనే మాసిపోయేట్టు ఉండే డెకరేటివ్‌ పీస్‌ల్లా కనిపిస్తాయే తప్ప... చేతిరుమాళ్లలా అనిపించవు. మీకూ నచ్చాయా ఇవి... అయితే ఈ అందమైన రుమాళ్లను మీ ఇంట్లోనూ తగిలించేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్