అరుణ కిరణం... టెన్జిన్!
‘ఏ రంగంలోనైనా మొదటివ్యక్తిగా నిలవడం అంత సులువైన పనేం కాదు... ఒంటరిగా నడుస్తున్నందుకు మీరేం భయపడొద్దు.

‘ఏ రంగంలోనైనా మొదటివ్యక్తిగా నిలవడం అంత సులువైన పనేం కాదు... ఒంటరిగా నడుస్తున్నందుకు మీరేం భయపడొద్దు. మరికొంత మంది మీ వెనకే వస్తారు’ అంటూ అరుణాచల్‌ప్రదేశ్‌కి చెందిన టెన్జిన్ యాంగ్కీని ఉద్దేశించి మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ పోస్ట్ పెట్టారు. అంతే, లోకమంతా ఎవరీ టెన్జిన్ అంటూ ఆన్‌లైన్‌లో తెగ వెదికేస్తోంది. ఇంతకీ ఆమె ప్రత్యేకత ఏంటనేగా మీ సందేహం. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్)లో చేరిన తొలి మహిళగా టెన్జిన్ చరిత్ర సృష్టించారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమైన కుటుంబం వారిది. తండ్రి స్వర్గీయ థుప్టెన్ టెంపా మాజీ ఐఏఎస్ అధికారి. రాష్ట్రమంత్రిగానూ పనిచేశారు. తల్లి జిగ్మిచోడెన్... రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ హోదాలో పదవీ విరమణ చేశారు.
ఇక, ఆమె తాత నైర్పాఖోవ్... తవాంగ్ ప్రాంతాన్ని భారత పాలనలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారట. దీంతో సహజంగానే టెన్జిన్‌కూ ప్రజాసేవలో నిమగ్నమవ్వాలనే కోరిక చిన్ననాటి నుంచే మొదలైంది. డిగ్రీవరకూ అసోంలోనే చదివారామె. ఆపై దిల్లీలోని జేఎన్‌యూలో చేరి పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. అదయ్యాక ఇంగ్లండ్‌లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో ఎమ్మెస్ చేశారు. తర్వాత సెంటర్‌ఫర్ పాలసీ రిసెర్చ్‌లో చేరారట. తర్వాత కొన్నాళ్లపాటు ఓ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలూ చెప్పారట.
2017లో అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి ఎంపికై సియాంగ్ జిల్లాలో అధికారిణిగా ఉద్యోగంలో చేరారు. అయితే, ఐపీఎస్ అవ్వాలన్నది తన కల కావడంతో సివిల్స్ రాశారు. ఆల్‌ఇండియా 545వ ర్యాంకు సాధించారు. తాజాగా హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మొదటి దశ శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగానే టెన్జిన్ పేరు సామాజిక మాధ్యమాల్లో చర్చకి వచ్చంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం రిపేర్ చేశారా?
 - నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- హ్యాట్సాఫ్... అమ్మాయిలూ
 - Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - 22ఏళ్ల అమ్మాయి... 100 మందికి అమ్మయ్యింది!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








