ఆకుకూరలే అమృతమ్మ ఇంటిపేరు..!
భూమిలో ఏది పండినా అది బంగారమే... కష్టాన్ని నమ్ముకుంటే నలుగురికీ మేలు చేయొచ్చు అని నమ్ముతారీమె. అందుకే ఇతరులకి భిన్నంగా ముప్పై ఏళ్ల నుంచి సేంద్రియ పద్ధతిలో ఆకుకూరల్ని పండిస్తున్నారు ముద్దం అమృతమ్మ అలియాస్ ఆకుకూరల అమృతమ్మ!

భూమిలో ఏది పండినా అది బంగారమే... కష్టాన్ని నమ్ముకుంటే నలుగురికీ మేలు చేయొచ్చు అని నమ్ముతారీమె. అందుకే ఇతరులకి భిన్నంగా ముప్పై ఏళ్ల నుంచి సేంద్రియ పద్ధతిలో ఆకుకూరల్ని పండిస్తున్నారు ముద్దం అమృతమ్మ అలియాస్ ఆకుకూరల అమృతమ్మ!
‘మాది జగిత్యాలలోని శంకుపల్లి. మావారు గంగారెడ్డి. మాకిద్దరు అబ్బాయిలు. మాది వ్యవసాయాధారిత కుటుంబం. భూమిని నమ్ముకుంటే మనతోపాటు నలుగురికీ అన్నం పెట్టొచ్చు అని నమ్ముతాను నేను. అందుకే 30ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఇరవైఏళ్ల క్రితం నా భర్త అనారోగ్యంతో మరణించారు. కుటుంబంలో పెద్దదిక్కు చనిపోతే వెన్నెముక లేని శరీరంలా ఉంటుంది ఆ కుటుంబం. రెక్కాడితే కానీ, డొక్కాడని పరిస్థితి మాది. ఆర్థికస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. పిల్లలిద్దరిదీ పాలు తాగే వయసు. నాకు కష్టం వచ్చింది కదా అని నేను బాధపడుతూ కూర్చుంటే వారి కడుపు నింపే దెవరు? అందుకే మాకున్న ఎకరా పొలంలో ఆకుకూరల్ని పండించడం మొదలుపెట్టాను. మావారు ఉన్నప్పుడు ఆయనతో కలిసి వ్యవసాయ పనులకి వెళ్లేదాన్ని. ఆ అనుభవమే ఇప్పుడు నాకు జీవనాధారమైంది. మొదట్లో సాగులో చాలా కష్టాలు చూశాను. నెమ్మదిగా మెలకువలు తెలుసుకున్నా. కాలాన్ని బట్టి ఆకుకూరల్ని పండిస్తున్నా. ఉన్న ఎకరాకి ఇంకో నాలుగు ఎకరాలు కొని ఆధునిక పద్ధతిలో కొత్తిమీర, పాలకూర, గోంగూర వంటివి పండిస్తున్నాను. వీటికి అనుబంధంగా కాయగూరల్నీ సాగు చేస్తున్నాను. పంటని దగ్గర్లోని మార్కెట్‌కి తీసుకెళ్లి అమ్ముతాం. వ్యవసాయం చేయడంలోనే నిజమైన ఆనందం దాగుంది’ అంటారు అమృతమ్మ. చుట్టుపక్కల గ్రామాల్లో ఈమెని ఆకుకూరల అమృతమ్మగా పిలుస్తుంటారు.
తుమ్మల శ్రీనివాస్, కరీంనగర్
విజయవంతమైన కెరియర్ నిర్మించుకోవడంలో మహిళలు ప్రత్యేకమైన సవాళ్లు ఎదుర్కొంటారు. వాటిని దాటడానికి తోటి మహిళల మద్దతు కూడా చాలా అవసరం. అంతేకాదు, స్త్రీలు తమ ఆశయాలను మనసులో ఉంచుకుంటే సరిపోదు. వాటిని బహిర్గతం చేయాలి. చేసే పనికి తాము అత్యంత అర్హులమని భావించాలి.
రేణుక రామనాథ్, మల్టిపుల్స్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం రిపేర్ చేశారా?
 - నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- హ్యాట్సాఫ్... అమ్మాయిలూ
 - Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - 22ఏళ్ల అమ్మాయి... 100 మందికి అమ్మయ్యింది!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








